Janhvi Kapoor | బాలీవుడ్ అగ్ర కథానాయిక జాన్వీకపూర్ వివాహం గురించి ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘జాన్వీకపూర్ తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్నది. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. దీనిపై జాన్వీకపూర్ కాస్త సీరియస్‌గానే రియాక్ట్ అయ్యింది. ‘మీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా రాస్తారా’ అంటూ స్పందించింది. దీంతో ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది.
మహారాష్ట్ర రాజకీయ కుటుంబానికి చెందిన శిఖర్ పహారియాతో జాన్వీకపూర్ గత కొంతకాలంగా డేటింగ్లో ఉందని ప్రచారం జరుగుతున్నది. పలు ఇంటర్వ్యూల్లో శిఖర్ గురించి జాన్వీకపూర్ గొప్పగా మాట్లాడింది. ఇటీవల ఓ ఈవెంట్‌కు ‘శిఖు’ అనే లోగో ఉన్న నెక్లెస్‌ను ధరించి వచ్చింది. దీంతో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ‘దేవర’ చిత్రంలో జాన్వీకపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నది. ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదలకానుంది.