HP Layoffs | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ (Layoffs) పర్వం కొనసాగుతోంది. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. గూగుల్, మెటా, ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించాయి. కరోనా తర్వాత ఆర్థిక మాంద్యం భయాలతో మొదలైన ఈ ప్రక్రియ.. ఇప్పుడు కృత్రిమ మేధ (AI) వైపు మళ్లుతోంది. కృత్రిమ మేధని అందిపుచ్చుకునేందుకు సంస్థలు కోతలకు తెగబడుతున్నాయి.
తాజాగా ప్రపంచ ప్రఖ్యాత పీసీ, ప్రింటర్ల తయారీ సంస్థ హెచ్పీ (HP) కూడా పెద్ద ఎత్తున లేఆఫ్స్ (HP Layoffs) ప్రకటించింది. 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంఖ్య కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10-12 శాతంగా ఉంటుందని అంచనా. ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంటర్నల్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఈ కోతలు ఉండనున్నట్లు సంస్థ సీఈఓ ఎన్రిక్ లారెస్ వెల్లడించారు. 2024 అక్టోబరు నాటికి హెచ్పీకి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58వేల మంది ఉద్యోగులున్నారు. సంస్థ నిర్ణయంతో రాబోయే రోజుల్లో వీరి సంఖ్య భారీగా తగ్గనుంది. ఈ ఏడాది ఆరంభంలోనూ హెచ్పీ దాదాపు 1000-2000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
Also Read..
Karnataka | సిద్ధరామయ్య Or శివకుమార్.. డిసెంబర్ 1నాటికి తేలనున్న కర్ణాటక కాంగ్రెస్ పంచాయితీ
Gold Price | మళ్లీ పెరుగుతున్న బంగారం ధర.. ఒకేరోజు రూ.3500 పెరిగిన పుత్తడి
Apple layoff | యాపిల్ సేల్స్ విభాగంలో ఉద్యోగాల కోత..!