Apple layoff | ప్రపంచ వ్యాప్తంగా టెక్ సంస్థలు వరుసగా ఉద్యోగుల తొలగింపులను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు విడతలవారీగా లేఆఫ్స్ ప్రకటించిన విషయం తె లిసిందే. ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్ (Apple layoff) కూడా వచ్చి చేరింది.
ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన సేల్స్ విభాగంలో (sales team) ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. అయితే, స్వల్ప సంఖ్యలో ఉద్యోగులపై మాత్రమే ఈ లేఆఫ్స్ ప్రభావం ఉండనుంది. అంతేకాదు, ఇతర విభాగాల్లో నియామకాలు కొనసాగనున్నాయి. తాజా లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇతర విభాగాల్లో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. ఈ మేరకు యాపిల్ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
Also Read..
Smriti Mandhana | స్మృతి మంధాన-పలాశ్ వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారు : పలాక్ ముచ్చల్
Pit Bull Attack | ఆరేండ్ల బాలుడిపై పెంపుడు కుక్క దాడి.. తెగిపడిన చెవి.. యజమాని అరెస్ట్
IMD: రాత్రి 7.30 లోపు వెళ్లిపోనున్న బూడిద మబ్బులు: ఐఎండీ