DA Hike | హోలీ సందర్భంగా (Holi bonanza) ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం (central government) గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది. డీఏను (కరవు భత్యం) సరవణ చేయనున్నట్లు తెలిసింది. ఈసారి కూడా డీఏను మరో 3 శాతం పెంచనున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 53 శాతంగా ఉన్న కరవు భత్యం 56 శాతానికి చేరనుంది. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మార్చి 14న హోలీ సందర్భంగా అధికారిక ప్రకటన ఉంటుందని తెలిసింది.
ప్రస్తుతం 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (dearness allowance) పెంచుతుంది. ఇది జనవరి, జులైల్లో జరగాల్సి ఉన్నప్పటికీ ఏటా మార్చి, అక్టోబరులో ప్రకటిస్తూ వస్తోంది. ఆలస్యంగా ప్రకటించినా.. బకాయిలతో కలిపి జనవరి, జులై నుంచే చెల్లిస్తారు. ముఖ్యంగా డీఏ సవరణ కోసం ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్‌ను (AICPIN-IW) ప్రాతిపదికగా తీసుకుంటుంది. ఇదే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది. గతేడాది అక్టోబర్‌లో దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి డీఏ పెంపు 3 శాతంగానే ఉండనున్నట్లు తెలిసింది. కేంద్రం డీఏను సరవించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డీఏ పెంచే అవకాశం ఉంటుంది.
Also Read..
MK Stalin | ఆలస్యం చేయకండి.. అత్యవసరంగా పిల్లల్ని కనండి : తమిళ ప్రజలకు సీఎం స్టాలిన్ కీలక విజ్ఞప్తి
Madhabi Puri Buch | స్టాక్ మార్కెట్ మోసాల కేసు.. సెబీ మాజీ చీఫ్‌కు కాస్త ఊరట
Ola Electric | 1,000 మందిపై వేటుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్.. ఐదు నెలల్లోనే రెండో రౌండ్ లేఆఫ్స్