Ola Electric | 1,000 మందిపై వేటుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్.. ఐదు నెలల్లోనే రెండో రౌండ్ లేఆఫ్స్
Ola Electric | ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.
Ola Electric | ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తోంది. నష్టనివారణ చర్యల్లో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
సంస్థ ఖర్చులను తగ్గించి, నిర్వాహక సామర్థ్యం పెంచేందుకు ఓలా ప్రయత్నిస్తున్నట్లు మీడియా కథనాలు నివేదిస్తున్నాయి. ప్రొక్యూర్మెంట్, కస్టమర్ రిలేషన్స్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా పలు విభాగాల్లో ఈ కోత ఉండనున్నట్లు సమాచారం. తొలగింపు వార్తల తర్వాత ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కూడా 5 శాతం పడిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు ఐదు నెలల్లోనే ఓలా ఎలక్ట్రిక్‌లో ఇది రెండో రౌండ్ తొలగింపులు. గతేడాది నవంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వెయ్యి మందిపై వేటు వేసేందుకు సంస్థ సిద్ధమైంది.
కాగా, ఇటీవలే కొన్ని రోజులుగా ఓలా ఎలక్ట్రిక్ పలు వివాదాలతో సతమతమవుతోన్న విషయం తెలిసిందే. సంస్థ కార్యకలాపాలు, సేవలపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వినియోగదారుల హక్కులు ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అనుసరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయంపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాదు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కమెడియన్ కునాల్ కమ్రా, భవీశ్ అగర్వాల్ మధ్య వివాదం కూడా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
PM Modi | కెమెరా చేతపట్టి లయన్ సఫారీకి వెళ్లిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్
Oscar Awards | వేశ్య కథకు అవార్డుల పంట.. తక్కువ బడ్జెట్‌తో విడుదలై రికార్డులు కొల్లగొట్టిన అనోరా
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

