PM Modi | నేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day). ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లయన్ సఫారీ (lion safari)కి వెళ్లారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని.. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యానికి వెళ్లారు. కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీశారు.
PM Narendra Modi visits Gir National Park in Gujarat pic.twitter.com/dC9sk9wQIB
— ANI (@ANI) March 3, 2025
ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం తన సొంత రాష్టం గుజరాత్ (Gujarat)కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం అక్కడ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి సాసన్‌లోని రాష్ట్ర అటవీ శాఖ నిర్వహించే అటవీ అతిథి గృహం సిన్హ్ సదన్‌లో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం స్థానిక మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతో కలిసి సిన్హ్ సదన్ నుంచి సఫారీకి బయల్దేరారు. జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో (Gir forest) సింహ సఫారీకి వెళ్లారు.
PM Narendra Modi takes lion safari in Gir forest in Gujarat pic.twitter.com/qnJDsaBewc
— ANI (@ANI) March 3, 2025
Also Read..
Prahlad Singh Patel | ప్రభుత్వాన్ని యాచించడం ప్రజలకు అలవాటైపోయింది.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Congress Govt | ఎస్సీ, ఎస్టీ నిధులు గ్యారెంటీలకు.. హామీల అమలుకు కాంగ్రెస్ సర్కారు నిర్వాకం!
Maharashtra | మహారాష్ట్రలో దారుణం.. సినిమాను చూసి ఆరేండ్ల బాలికను హత్య చేసిన బాలుడు