Madhabi Puri Buch | స్టాక్ మార్కెట్ మోసాల కేసులో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ (Madhabi Puri Buch)కు కాస్త ఊరట లభించింది. మాధవి, మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ముంబై ప్రత్యేక కోర్టు (Mumbai Sessions Court) ఆదేశాలపై చర్యలు తీసుకోవద్దని బాంబే హైకోర్టు (Bombay High Court) సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
స్టాక్ మార్కెట్ మోసాలు, నియంత్రణ సంబంధిత ఉల్లంఘనల ఆరోపణలపై మాధవి పురి బుచ్, మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ముంబై ప్రత్యేక కోర్టు శనివారం ఆదేశించించిన విషయం తెలిసిందే. దీనిపై మాధవి, హోల్ టైమ్ సభ్యులు అశ్వని భాటియా, అనంత్ నారాయణ్ జి, కమలేష్ చంద్ర వర్ష్నీ, బీఎస్ఈ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సీఈవో సుందరరామన్ రామమూర్తిలు హైకోర్టులో వ్యక్తిగతంగా పిటిషన్లు దాఖలు చేశారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది. రేపు వీటిపై విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలపై మంగళవారం వరకూ చర్యలు తీసుకోవద్దని మహారాష్ట్ర అవినీతి నిరోధక విభాగాన్ని జస్టిస్ శివకుమార్ డిగే ఆదేశించారు.
సెబీ మాజీ చీఫ్‌పై ఎఫ్ఐఆర్
స్టాక్ మార్కెట్ మోసాలు, నియంత్రణ సంబంధిత ఉల్లంఘనల ఆరోపణలపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్, మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ప్రత్యేక కోర్టు శనివారం ఆదేశించింది. నియంత్రణకు సంబంధించిన లోపాలు జరిగినట్లు, కుమ్మక్కు అయినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, వీటిపై న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని తెలిపింది. దర్యాప్తును తాను పర్యవేక్షిస్తానని జడ్జి తెలిపారు. ఓ మీడియా రిపోర్టర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఈ ఆదేశాలను ఇచ్చారు. ఓ కంపెనీని స్టాక్ ఎక్సేంజ్‌లో మోసపూరితంగా లిస్టింగ్ చేశారని, ఇదంతా రెగ్యులేటరీ అథారిటీస్ చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల జరిగిందని తెలిపారు.
అదానీ విదేశీ ఫండ్లలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్ పర్సన్ (Sebi chief) మాధాబీ పురీ బుచ్ (Madhabi Puri Buch), ఆమె భర్తకు వాటాలున్నాయని షార్ట్ సెల్లింగ్ సంస్ధ, మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్ నివేదిక దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నివేదిక దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలో సెబీ చీఫ్‌కు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (Public Accounts Committee) సమన్లు కూడా జారీ చేసింది. అయితే, ఆ తర్వాత విచారణ అనంతరం ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
Also Read..
Ola Electric | 1,000 మందిపై వేటుకు సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్.. ఐదు నెలల్లోనే రెండో రౌండ్ లేఆఫ్స్
PM Modi | కెమెరా చేతపట్టి లయన్ సఫారీకి వెళ్లిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్
Oscar Awards | వేశ్య కథకు అవార్డుల పంట.. తక్కువ బడ్జెట్‌తో విడుదలై రికార్డులు కొల్లగొట్టిన అనోరా