BSNL&MTNL assets For Sale | కేంద్ర ప్రభుత్వ టెలికం రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ స్థిరాస్తులను అమ్మివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ రెండు సంస్థలకు దేశవ్యాప్తంగా రూ.970 కోట్ల విలువ గల ఆస్తులు ఉన్నాయని సమాచారం. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు చండీగఢ్, భావ్‌నగర్, కోల్‌కతా నగరాల్లో బీఎస్ఎన్ఎల్కు రూ.660 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.
వారాసి హిల్, ముంబైలో ఎంటీఎన్ఎల్కు గల రూ.310 కోట్ల విలువ గల ఆస్తులు ఉన్నాయి. వీటిని విక్రయించనున్నామని కేంద్ర ప్రభుత్వం తన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్-దీపం (Department of Investment and Public Asset Management (DIPAM) వెబ్సైట్లో పేర్కొంది.
తొలి దశలో ఈ రెండు సంస్థలకు చెందిన రూ.970 కోట్ల విలువ గల ఆస్తులను విక్రయిస్తామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ కం మేనేజింగ్ డైరెక్టర్ పీకే పూర్వార్ చెప్పారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. వచ్చేనెల 14న ఎంటీఎన్ఎల్ ఆస్తుల ఈ-వేలం ప్రక్రియ చేపట్టనున్నామన్నారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణకు 2019లో రూ.69 కోట్లతో ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. ఇందుకోసం వచ్చే ఏడాది నాటికి రూ.37,500 కోట్ల విలువ గల ఆస్తులను కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Password : ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా జనం.. కారణం ఏంటి?