Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు | ఒకటి కాదు.. రెండు కాదు.. కోట్ల సంఖ్యలో ఎర్ర పీతలు(Red Crabs) ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో అక్కడి జనాలు బెంబేలెత్తిపోయారు.
ఒకటి కాదు.. రెండు కాదు.. కోట్ల సంఖ్యలో ఎర్ర పీతలు(Red Crabs) ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో అక్కడి జనాలు బెంబేలెత్తిపోయారు. అక్కడున్న రోడ్లు, బ్రిడ్జిలు, పార్కులు, ఇళ్ల మీదికి ఆ పీతలు ఎగబడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు ఇళ్లు వదిలి బయటకు రాలేకపోతున్నారు. డోర్లన్నీ మూసేసుకొని ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. చివరకు రోడ్లు కూడా మూసేశారు. బయటికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇంతకీ ఈ పీతలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎందుకు వచ్చాయి.. అనే విషయం తెలుసుకుందాం రండి.

ఆస్ట్రేలియాలోని క్రిస్మస్ ఐలాండ్‌లోనే ఈ విచిత్రం చోటు చేసుకుంది. ఐలాండ్‌కు వచ్చిన టూరిస్టులు, అక్కడి స్థానికులు.. లక్షల సంఖ్యలో ఐలాండ్‌లో తిరుగుతున్న క్రాబ్స్ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి.. ప్రతి సంవత్సరం అడవి నుంచి వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉన్న నేషనల్ పార్క్ తీరం వైపు కొన్ని వేల క్రాబ్స్ వెళ్తుంటాయి. కానీ.. ఈసారి మాత్రం ఆ సంఖ్య పెరిగింది. దాదాపు 5 కోట్ల పీతలు.. రోడ్లు, పార్కులు, ఇళ్లు, బ్రిడ్జిలను ఆక్రమించాయి. దీంతో అక్కడి ప్రభుత్వం వెంటనే అన్ని రోడ్లను మూసేసింది. అక్కడి స్థానికులు.. రోడ్ల మీద పాకుతూ వెళ్తున్న పీతల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అడవుల్లో వర్షాలు పడటం ఆగిపోయిన తర్వాత క్రాబ్స్ అన్నీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. అవి రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్‌లో జరుగుతుంది. కానీ.. ఈసారి వాటి సంఖ్య పెరిగింది. అందుకే అందరూ ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఐలాండ్‌లో మొత్తం జనజీవనం వాటి వల్ల స్థంభించి పోవాల్సి వచ్చింది.. అని క్రిస్మస్ ఐలాండ్‌కు చెందిన ఓ స్థానికుడు స్పష్టం చేశారు.
అవి వెళ్లే దారిలో వాటికి ఏవి కనిపిస్తే వాటిని తింటూ తమ ప్రయాణాన్ని సాగిస్తాయి. పూలు, గింజలు, ఆకులు, పండ్లు.. ఇలా వాటికి ఏది దొరికితే వాటిని తింటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్రాబ్స్ రోడ్లను ఆక్రమించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోలను చూసేయండి.
Roads on Christmas Island were closed as thousands of red crabs emerged from the forest to begin their annual migration journey to the ocean on the island off the coast of Western Australia pic.twitter.com/zRvP2iCdC4
— Reuters (@Reuters) November 18, 2021
Millions of red crabs have flooded the roads on #Australia's Christmas Island pic.twitter.com/7360P41Iu9
— BreakinNewz (@BreakinNewz01) November 18, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కసాయి చేతుల్లో నుంచి చావును తప్పించుకొని 800 కిమీల దూరం పారిపోయిన ఆవు.. వీడియో వైరల్
కోడి ముందా? గుడ్డు ముందా? ఆన్సర్ దొరికేసిందోచ్.. ఏది ముందో సైంటిస్టులు తేల్చేశారు
బయటపడ్డ 4500 ఏళ్ల క్రితం నాటి సూర్యదేవాలయం.. ఎక్కడో తెలుసా?
Bull : ఈ ఎద్దు విలువ రూ. కోటి.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

