మీరు గజినీ సినిమా చూశారా? చూసే ఉంటారు లెండి. ఆ సినిమాలో సూర్య.. మెమోరీ లాస్ అయిన వ్యక్తిగా కనిపిస్తాడు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి అన్నీ మరిచిపోతుంటాడు సూర్య. దాన్నే షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ అంటారు. అందుకే.. 10 నిమిషాల్లో తను ఎవరినైతే కలుస్తాడో.. వెంటనే వాళ్ల వివరాలు, తను వెళ్లిన ప్రదేశం వివరాలను ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండేవాడు. 10 నిమిషాల తర్వాత తను మరిచిపోయినా.. తను రాసుకున్న వివరాల ప్రకారం మళ్లీ గుర్తుకు తెచ్చుకునేవాడు. అయితే అది సినిమా. నిజంగా అలాంటి గజినీలు ఉంటారా? అని మనం ఆ సినిమా చూసి అనుకున్నాం కానీ.. నిజంగానే అటువంటి గజినీలు ఉంటారు అని ఒకటి రెండు సంఘటనలు కూడా రియల్‌గా జరిగాయి. రియల్ లైఫ్ గజినీలను చూశాం.
తాజాగా మరో రియల్ లైఫ్ గజినీ.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఆయన పేరు డేనియల్ స్క్మిడ్త్. జర్మనీకి చెందిన డేనియల్‌కు 6 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి మనోడి పరిస్థితి గజినీలా అయిపోయింది.
కారులో డేనియల్ వెళ్తుండగా.. సిగ్నల్ దగ్గర మరో కారు వేగంగా వచ్చి తన కారును ఢీకొట్టుకుంటూ వెళ్లడంతో డేనియల్ తలకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. తన మెదడు దెబ్బతిన్నదని డాక్టర్లు చెప్పారు. దాన్నే లేవల్ త్రీ టీబీఐ అంటారట. దాని వల్ల.. డేనియల్ తన మెదడులో నిక్షిప్తం అయి ఉన్న జ్ఞాపకాలను అన్నింటినీ మరిచిపోయాడు. ఫ్రెష్‌గా లైఫ్‌ను ప్రారంభించాడు. ప్రతి 6 గంటలకు ఓసారి అన్నీ మరిచిపోతుంటాడు. దీంతో ప్రత్యేకంగా ఒక డైరీని ఏర్పాటు చేసుకొని ఆ డైరీలో ఆ 6 గంటలు జరిగిన విషయాలు అన్నింటినీ నోట్ చేసుకుంటాడు. 6 గంటలు కాగానే.. అన్నీ మరిచిపోతాడు. దీంతో ఆ డైరీ చూసుకొని మళ్లీ తన జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు.
తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత తన మెమోరీ లాస్ వల్ల గర్ల్‌ఫ్రెండ్స్ దూరం అయ్యారు. ఫ్రెండ్స్ దూరం అయ్యారు. ఆ తర్వాత తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ కత్రినాతో స్నేహం ఏర్పడింది. వాళ్లు పెళ్లి చేసుకున్నారు. బాబు కూడా పుట్టాడు. కానీ.. ఆ బాబు బర్త్‌డేను మాత్రం డేనియల్ ఎప్పుడూ మరిచిపోతుంటాడు.
అన్నట్టు డేనియల్ ఇటీవల ఓ డాక్యుమెంటరీ తీశాడు. ఆ డాక్యుమెంటరీలో తనకు మెమోరీ లాస్ ఎలా వచ్చింది. యాక్సిడెంట్ ఎలా అయింది. తన పరిస్థితి ఏంటి.. అనే విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ బామ్మ వయసు 105 ఏళ్లు.. అయినా పరుగుపందెంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది
ఆ ఐలాండ్‌లో మహిళలదే రాజ్యం.. వాళ్లదే పైచేయి.. మరి పురుషులు ఏం చేస్తారు?
Dwarfs : ఆ ఊళ్లో సగం మంది మరుగుజ్జులే.. కారణం ఏంటో తెలుసా?
Oxygen on Moon | చంద్రుడిపై ఆక్సిజన్.. 800 కోట్ల మంది లక్ష ఏండ్లు ఈజీగా బతికేయొచ్చు