ఆ బామ్మ వయసు 105 ఏళ్లు.. అయినా పరుగుపందెంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది
ఆ బామ్మ వయసు 105 ఏళ్లు | 105 ఏళ్లు ఎవరైనా జీవిస్తారా? లక్షల్లో కోట్లలో ఒకరికే ఆ అదృష్టం దక్కుతుంది. వందేళ్లు బతికినా కూడా కొందరు అయితే మంచం నుంచి లేవరు
105 ఏళ్లు ఎవరైనా జీవిస్తారా? లక్షల్లో కోట్లలో ఒకరికే ఆ అదృష్టం దక్కుతుంది. వందేళ్లు బతికినా కూడా కొందరు అయితే మంచం నుంచి లేవరు. కాళ్లు కింద పెట్టలేరు. కనీసం నడవలేరు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. వయసు మీదపడుతున్న కొద్దీ ఒంట్లో శక్తి నశించి.. నీరసం వచ్చేస్తుంటుంది. అందుకే వృద్ధులు ఎక్కువగా నడవలేరు.. నిలబడలేరు.. పరిగెత్తలేరు.

కానీ.. ఈ బామ్మ మాత్రం తన వయసును పక్కన పెట్టి ఏకంగా పరుగుపందెంలో పాల్గొన్నది. తన వయసు ఎంతో తెలుసా 105 ఏళ్లు. వందేళ్లు దాటాక కూడా ఎంతో హుషారుగా ఉంటూ.. అందరినీ ఉత్సాహపరుస్తూ తను పరుగుపందెంలో పాల్గొని చేసిన రచ్చ మామూలుగా లేదు.
జులియా హాకిన్స్ అనే 105 ఏళ్ల బామ్మ గురించే మనం మాట్లాడుకునేది. తనది యూఎస్. రిటైర్డ్ టీచర్. తనకు 101 వయసు వచ్చినప్పటి నుంచి రన్నింగ్ చేయడం ప్రారంభించింది. తనకు 80 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నేషనల్ సీనియర్ గేమ్స్‌లో పాల్గొన్నది.
ఆ అనుభవంతోనే ఇప్పుడు రన్నింగ్ మీద దృష్టి పెట్టింది. తనకు 105 ఏళ్ల వయసు అన్న సంగతి కూడా మరిచిపోయి లూయిసియానా సీనియర్ గేమ్స్ స్టేడియంలో.. స్ప్రింటింగ్‌లో పాల్గొన్నది. 100 మీటర్ల స్ప్రింటింగ్‌లో పాల్గొని కేవలం నిమిషం మీద రెండు సెకన్ల టైమ్‌లో పరుగును పూర్తి చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ ఫీట్ పూర్తి చేసిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా చరిత్ర సృష్టించింది జులియా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఆ ఐలాండ్‌లో మహిళలదే రాజ్యం.. వాళ్లదే పైచేయి.. మరి పురుషులు ఏం చేస్తారు?
Dwarfs : ఆ ఊళ్లో సగం మంది మరుగుజ్జులే.. కారణం ఏంటో తెలుసా?
Oxygen on Moon | చంద్రుడిపై ఆక్సిజన్.. 800 కోట్ల మంది లక్ష ఏండ్లు ఈజీగా బతికేయొచ్చు
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

