Oxygen on Moon | చంద్రుడిపై ఆక్సిజన్.. 800 కోట్ల మంది లక్ష ఏండ్లు ఈజీగా బతికేయొచ్చు
Oxygen on Moon | చంద్రుడి ఉపరితలం పై పొరల్లో 800 కోట్ల మందికి.. కనీసం లక్ష సంవత్సరాల పాటు సరిపడినంత ఆక్సిజన్ దాగి ఉన్నదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిని వెలికి తీయగలిగితే చందమామపై మానవ జీవనం అనే కల నిజం కావొచ్చని పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు పెరుగుతున్న వేళ మార్స్, చంద్రుడిపై జీవనం గురించిన ఊహలు పెరుగుతున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా భూమికి దగ్గరగా ఉన్న చందమామ మీదకు ఇప్పటికే మనిషి వెళ్లివచ్చాడు. అక్కడ ఆక్సిజన్‌ను అందించగలిగితే మనుషులు జీవించడం అసాధ్యమేం కాదన్న అంచనాలున్నాయి.

చంద్రుడిపై వాతావరణం ఉండదు. ఉన్న కొద్దిపాటి వాయువులు కూడా హైడ్రోజన్, నియాన్, ఆర్గాన్ లాంటివే ఉన్నాయి. ఇవి జీవం మనుగడకు ఉపయోగపడవు. అయితే ఇటీవల అక్కడి మట్టి నమూనాలపై జరిపిన పరిశోధనల్లో.. చంద్రుడి ఉపరితలం పైపొరల్లోని మట్టిలో ఆక్సిజన్ ఉన్నట్టు తెలిసింది. ఈ పైపొరలను రిగోలిథ్ అంటారు. రిగోలిథ్‌లో 45% దాకా ఆక్సిజన్ ఉండొచ్చని అంచనా. భూమి లాగే చంద్రుడి గర్భంలో కూడా సిలికా, అల్యూమీనియం, ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్ల వంటి ఖనిజాలు ఉంటాయి. ఈ ఖనిజాల్లోనే ఆక్సిజన్ నిక్షిప్తమై ఉంటుంది. దీనిని నేరుగా పీల్చలేం. దీనిని మనిషి పీల్చడానికి అనువైన ఆక్సిజన్ గా మార్చాలంటే ఎలక్ట్రోలైసిస్ లాంటి ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. దీని కోసం ఈ మట్టి పొరల్లోని ఆక్సైడ్లను ద్రవ రూపంలోకి మార్చాలి. ఇలాంటి సాంకేతిక ఇప్పటికే భూమిపై ఉంది. కాబట్టి భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఈ సాంకేతికతను చంద్రుడిపై వాడి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

క్యూబిక్ మీటర్లో 630 కిలోలు
ఇప్పటివరకు చంద్రుడి మట్టిపై జరిపిన పరిశోధనలను బట్టి రిగోలిథ్‌లో ఒక్కో క్యూబిక్ మీటర్లో 630 కిలోల ఆక్సిజన్ ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మనిషి బతకాలంటే రోజుకు 800 గ్రాముల ఆక్సిజన్ చాలు. అంటే 630 కిలోల ఆక్సిజన్‌తో మనిషి రెండు ఏండ్లు బతకొచ్చు. రిగోలిథ్ 10 మీటర్లు ఉందనుకొంటే.. దాని నుంచి 800 కోట్ల మందికి లక్ష సంవత్సరాలు సరిపడా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
the moon | చందమామ వల్ల నిద్రలేమి!
Moon resort | నేలమీద చందమామ రిసార్ట్.. ఎక్కడో తెలుసా
mars | బృహస్పతి చంద్రుడిపై నీటి ఆవిరి
Star Forming | కళ్లుచెదిరే అంతరిక్ష దృశ్యాన్ని అందరితో పంచుకున్న నాసా
business park in space | రోదసిలో బెజోస్ బిజినెస్ పార్క్
అంతరిక్షంలో మూవీ షూటింగ్ చేసి భూమిపై ల్యాండైన డైరెక్టర్, నటి.. వీడియో
Medicines in space : ఇకపై మందులు, వ్యాక్సిన్లు అన్నీ రోదసిలోనే తయారీ.. ఎందుకో తెలుసా
Hotel in space | అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

