వాషింగ్టన్: రోదసిలో వాణిజ్య అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సమాయత్తమయ్యారు. ‘ఆర్బిటాల్ రీఫ్ బిజినెస్ పార్క్’ పేరిట ఈ స్పేస్‌స్టేషన్‌ను నిర్మిస్తున్నట్టు ‘బ్లూ ఆరిజన్’ సంస్థ ప్రకటించింది. స్పేస్‌స్టేషన్ నిర్మాణం కోసం ఈ దశాబ్దపు ద్వితీయార్థంలో స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపనున్నట్టు వెల్లడించింది. రోదసి రంగంలో మౌలిక సదుపాయాలను, ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడమే ధ్యేయంగా ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు వివరించింది.