Star Forming | కళ్లుచెదిరే అంతరిక్ష దృశ్యాన్ని అందరితో పంచుకున్న నాసా
Star Forming | అంతరిక్షంలో జరిగే చిన్న ఘటన కూడా మనకు అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటిది రోదసిలో జరిగే అద్భుతమే కంటపడితే?

వాషింగ్టన్: అంతరిక్షంలో జరిగే చిన్న ఘటన కూడా మనకు అద్భుతంగా కనిపిస్తుంది. అలాంటిది రోదసిలో జరిగే అద్భుతమే కంటపడితే? దాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తాజాగా షేర్ చేసిన ఫొటో చూస్తే సరిగ్గా అదే భావన కలుగుతుంది. అంతరిక్షంలో కొత్త నక్షత్రాలు ఏర్పడుతున్న దృశ్యాలను ఇన్స్టాగ్రామ్లో నాసా పంచుకుంది.
ఈ ఫొటోల్లో అంతరిక్షంలో నక్షత్రాలు జన్మించే ప్రాంతాన్ని హబుల్ టెలిస్కోప్ తన కెమెరాలో బంధించింది. నక్షత్రాలు రూపుదిద్దుకునే ఈ ప్రాంతంలో ఎరుపు, పసుపు కలిసిన రంగు మబ్బుల్లో నక్షత్రాలు వజ్రాల్లా మెరిసిపోతూ కనిపిస్తున్నాయి. వీటిని హబుల్ టెలిస్కోప్ కెమెరాలో బంధించినట్లు తెలిపింది.
1990లో అంతరిక్షంలోకి పంపిన ఈ టెలిస్కోప్ 20 ఏళ్లుగా 13 లక్షలపైగా అంతరిక్ష అద్భుతాలను మనకు అందించింది. ఇటీవల రెండు గెలాక్సీలో ఒకదాని ఆకర్షణకు లోబడి ఒకటి డ్యాన్స్ చేస్తున్నట్లు కదులుతున్న ఫొటోను కూడా నాసా షేర్ చేసింది. ఇప్పుడు కొత్తగా జన్మించిన నక్షత్రాలు రూపుదిద్దుకుంటున్న ఫొటోను పంచుకుంది. నక్షత్రాల పుట్టుక సమయంలో ఏర్పడిన దుమ్ము, మబ్బులు కూడా మెరుస్తూ ఉండటంతో ఈ ప్రాంతమంతా అస్తమిస్తున్న సూర్యుడి రంగులో కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెప్పారు.
Read Today's Latest Nt-special News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

