ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆరు నెలల వ్యవధిలోనే (ఏప్రిల్-సెప్టెంబర్ 2026) తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని, శాసనసభ సాక్షిగా చేసిన అంకెల గారడీ మొత్తం కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా అర్ధవార్షిక నివేదికతో బట్టబయలైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- గ్యారెంటీల లెకలను కాగ్ నుంచే దాచిపెట్టిన రేవంత్ సరార్
- ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజుశ్రవణ్ డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఆరు నెలల వ్యవధిలోనే (ఏప్రిల్-సెప్టెంబర్ 2026) తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని, శాసనసభ సాక్షిగా చేసిన అంకెల గారడీ మొత్తం కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజా అర్ధవార్షిక నివేదికతో బట్టబయలైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన అసమర్థ పాలన, అడ్డగోలు అప్పులతో ఖజానాను ఖాళీ చేసి, రాజ్యాంగబద్ధ ఆడిట్ సంస్థలకే తప్పుడు లెకలు చెప్తూ రాష్ట్రాన్ని దివాలా అంచున నిలబెట్టారని విమర్శించారు.‘నాయకత్వానికి కావలసింది ప్రజలకు ఉపయోగపడే పదునైన ఆలోచనలు, అంతేకాని పసలేని రాజకీయ ఆరోపణలు కావు.
కొత్త ఆదాయ మార్గాలను వెతకకుండా, ఉన్న ఆస్తులను కరిగిస్తూ పోవడం వల్ల తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంవైపు నెట్టకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంచే తెలివి లేక, ఉన్న ఆస్తులను కరిగించేస్తూ తెలంగాణ పిల్లల భవిష్యత్తును అప్పుల పాలు చేస్తున్నది’ అని మండిపడ్డారు. సెప్టెంబర్ నెల కాగ్ నివేదిక విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ లోపాలపై శుక్రవారం దాసోజు ఒక ప్రకటనల విడుదల చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో రూ.6,857.76 కోట్ల రెవెన్యూ మిగులు సాధిస్తామని అసెంబ్లీలో డాంబికాలు పలికిందని, కానీ ఆరు నెలల్లోనే ఆ అంచనా పూర్తిగా తలకిందులై, ఏకంగా రూ. 15,096.18 కోట్ల భారీ రెవెన్యూ లోటులోకి రాష్ట్రం కూరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

