Password : ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు | జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, నెట్ బ్యాకింగ్.. ఇలా పలు అప్లికేషన్ల కోసం యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది.
జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, నెట్ బ్యాకింగ్.. ఇలా పలు అప్లికేషన్ల కోసం యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొందరైతే.. అన్ని అప్లికేషన్లకు ఒకే పాస్వర్డ్ వాడుతుంటారు. ఇంకొందరు అయితే.. చాలా ఈజీగా ఉండే పాస్వర్డ్స్ వాడుతుంటారు. ఈజీగా గుర్తుండిపోయేవి, ఈజీగా గెస్ చేయగలిగేవి పెడుతుంటారు. వాళ్లకు పాస్వర్డ్ ఈజీగా గుర్తుండేందుకు పెట్టుకున్నా.. హ్యాకర్స్, సైబర్ క్రిమినల్స్.. అలా ఈజీగా గెస్ చేయగలిగే పాస్‌వర్డ్స్‌ను ఈజీగా క్రాక్ చేసి.. పర్సనల్ డేటాను హ్యాక్ చేస్తారు.

అయితే.. భారత్‌లో ఎక్కువ మంది తమ సోషల్ మీడియా నెట్ వర్క్స్ కోసం, మెయిల్ కోసం ఏ పాస్ వర్డ్ ఉపయోగిస్తారో తెలుసా? పాస్ వర్డే అవును.. password పేరునే ఎక్కువ శాతం మంది ఇండియన్స్ వాడుతారట. ఇటీవలే నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. చాలామంది 123456 ను ఎక్కువ శాతం ఇండియన్స్ పెట్టుకుంటారు అని అనుకుంటారు కానీ.. పాస్ వర్డ్ అనే కీవర్డ్నే ఎక్కువ శాతం మంది ఉపయోగిస్తున్నారట.
పాస్ వర్డ్ టాప్ ప్లేస్ లో నిలవగా.. తర్వాత స్థానాల్లో iloveyou, krishna, sairam, omsaira, sweetheart, sunshine, lovely అనే పదాలు నిలిచాయి. నోర్డ్‌పాస్ అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో పాస్‌వర్డ్‌కు సంబంధించి ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

న్యూమరికల్, కీబోర్డ్ సీక్వెన్స్‌లో ఉన్న లెటర్స్‌ను ఎక్కువగా ఇండియాలో పాస్‌వర్డ్స్‌గా పెట్టుకుంటారు అని వెల్లడించిన సర్వే.. ఇండియా తర్వాత జపాన్ దేశంలో మాత్రమే ఇటువంటి పాస్ వర్డ్స్‌ను వాడుతారని స్పష్టం చేసింది.
12345, qwerty లాంటి సీక్వెన్స్‌లు లిస్టులో టాప్‌లో ఉన్నాయి. అయితే.. 50 లో 43 దేశాల్లో 123456 అనే పాస్వర్డ్ టాప్‌లో ఉందట. ఇండియాలో మాత్రం password టాప్‌లో ఉందట. ఒకవేళ మీరు కూడా పాస్వర్డ్ కీవర్డ్నే పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటే వెంటనే మార్చుకోండి. లేదంటే మీ అకౌంట్ హ్యాకర్ల చేతికి వెళ్లినట్టే.
ఇవి కూడా చదవండి..
Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
కసాయి చేతుల్లో నుంచి చావును తప్పించుకొని 800 కిమీల దూరం పారిపోయిన ఆవు.. వీడియో వైరల్
కోడి ముందా? గుడ్డు ముందా? ఆన్సర్ దొరికేసిందోచ్.. ఏది ముందో సైంటిస్టులు తేల్చేశారు
బయటపడ్డ 4500 ఏళ్ల క్రితం నాటి సూర్యదేవాలయం.. ఎక్కడో తెలుసా?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

