Cognizant | ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వంటి కారణాలతో ఖర్చు తగ్గింపులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను లేఆఫ్స్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఐటీ ఉద్యోగుల్లో (IT Employees) లేఆఫ్స్ గుబులు నెలకొంది. ఇలాంటి సమయంలో ప్రముఖ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) తమ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 80 శాతం మంది అర్హులైన ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు (Salary Hikes) ప్రకటించింది.
రెండో త్రైమాసిక ఆదాయాలపై ప్రకటన సందర్భంగా సంస్థ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రతిభ ఆధారంగా 80 శాతం అర్హులైన ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ పెంపు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని గురువారం ప్రకటించింది. ఈ జీతాల పెంపు సీనియర్ అసోసియేట్ స్థాయి హోదా వరకూ ఉంటుందని తెలిపింది. అయితే, ఎంత మొత్తంలో హైక్ ఉంటుందన్నది మాత్రం వెల్లడించలేదు. ఉద్యోగి పనితీరు, వచ్చిన రేటింగ్ ఆధారంగా నిర్ణయించనున్నట్లు స్పష్టం చేసింది.
Also Read..
Cloudburst | జమ్ము కశ్మీర్లో క్లౌడ్‌బరస్ట్.. 12 మంది భక్తులు మృతి