Robbery | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్ (Indore)లో దొంగలు హల్చల్ చేశారు. ఓ రిటైర్డ్ న్యాయమూర్తి (ex judge) ఇంట్లోకి చొరబడ్డ దొంగలు (loots) అందినకాటికి దోచుకెళ్లారు (Robbery). ఇంట్లోని వాళ్లు గాఢ నిద్రలో ఉన్న సమయంలో సైలెంట్‌గా తమ పనికానిచ్చారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్‌లోని విజయ్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ గార్గ్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడ్డ ముగ్గురు దొంగలు బంగారం, డబ్బు దోచుకెళ్లారు. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో చోరీకి పాల్పడ్డారు. మొత్తం ముగ్గురు దొంగలు ఇంట్లోకి చోరీ కోసం వచ్చినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.
అందులోని ఒకరు గదిలోని కబోర్డ్‌లో ఉన్న విలువైన వస్తువులను దోచుకుంటుండగా.. మరొకరు బెడ్‌పై నిద్రపోతున్న మాజీ న్యాయమూర్తి లేస్తే ఇనుప రాడ్ (iron rode)తో కొట్టేందుకు మంచం వద్ద నిలబడి ఉన్నారు. మరో వ్యక్తి బయట కాపలా కాస్తూ కనిపించాడు. ఆ సమయంలో వాచ్మెన్ కూడా నిద్రపోతున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.లక్షల విలువైన బంగారు నగలు, ఖరీదైన వస్తువులతో పాటు డబ్బులు కూడా దొంగలు దోచుకెళ్లినట్లు చెప్పారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
మరోవైపు మాజీ న్యాయమూర్తి ఇంట్లో దొంగతనానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పక్కనే దొంగలు దోచుకుంటుంటే అంతలా నిద్రపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తాగి పడిపోయాడా ఏంటి..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే బెడ్రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
3 criminals rohbed a retired Justice Ramesh Garg’s residence in Indore in just 4 minutes and 10 seconds and got away with Rs 5 lakh and gold-silver jewellery.
They would have killed Justice Garg’s son (in the video) if he had woken up. Fortunately, he kept sleeping despite the… pic.twitter.com/MTg8cJgaPQ
— Incognito (@Incognito_qfs) August 13, 2025
Also Read..
Cloudburst | జమ్ము కశ్మీర్లో క్లౌడ్‌బరస్ట్.. 12 మంది భక్తులు మృతి
IMD | రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం : ఐఎండీ
Heavy Rain | ఢిల్లీలో వర్షబీభత్సం.. బైక్‌పై చెట్టు కూలడంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు