IMD | ఇటీవలే సంభవించిన వరదలకు అతలాకుతలమైన ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్ష సూచన చేసింది. రాబోయే మూడు గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్మోరా, బాగేశ్వర్, చమోలీ, చంపావత్, డెహ్రాడూన్, నైనిటాల్, పౌరీ గర్వాల్, పిథోరాఘర్, రుద్ర ప్రయాగ్, టెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్, ఉత్తర కాశీ (Uttar Kashi)లోని ఏకాంత ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా, ఇండ్లలోనే ఉండాలని సూచించారు.
Heavy rain accompanied with lightning and thunder is very likely to occur at isolated places over Almora, Bageshwar, Chamoli, Champawat, Dehradun, Nainital, Pauri Garhwal, Pithoragarh, Rudra Prayag, Tehri Garhwal, Udham Singh Nagar, Uttar Kashi in the next 3 hours: IMD,…
— ANI (@ANI) August 14, 2025
గతవారం ఉత్తరకాశీలో జల విలయం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పవిత్ర చార్ధామ్లలో ఒకటైన గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి గ్రామంపై ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. కుంభవృష్టి కారణంగా వచ్చిన మెరుపు వరదలకు కొండచరియలు విరిగిపడి ఇళ్లు, హోటళ్లు, కార్లు కొట్టుకుపోయాయి. ఈ విపత్తుకు పలువురు మృత్యువాత పడగా సుమారు 70 మంది గల్లంతయ్యారు. భారతీయ సైనిక శిబిరం ఉన్న హార్సిల్లో కూడా కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ప్రస్తుతం వారం రోజులుగా వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read..
Heavy Rain | ఢిల్లీలో వర్షబీభత్సం.. బైక్పై చెట్టు కూలడంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
Supreme Court: ఢిల్లీలో వీధి కుక్కలు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు