Cloudburst | హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా సంభవించిన వరదలు (Flash Floods) విధ్వంసం సృష్టించాయి. అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి.
Flash flood today in Bathad village of Banjar (Kullu) in Himachal Pradesh
Rains likely to pickup across Uttarakhand, Himachal Pradesh and Jammu division after mid night into tomorrow. Isolated places to receive extremely heavy rainfall
Video from Nitish Verma bhai pic.twitter.com/AN8umtT5DY
— Weatherman Shubham (@shubhamtorres09) August 13, 2025
సిమ్లా, లాహౌల్, స్పితి జిల్లాల్లో అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్రం అంతటా రెండు జాతీయ రహదారులు సహా 300కిపైగా రోడ్లను అధికారులు మూసివేశారు (Roads Closed). గన్వి రావైన్‌లో తాజా వరదలకు ఓ పోలీసు పోస్ట్ కూడా కొట్టుకుపోయింది. అయితే, ఈ విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. లాహౌల్, స్పితి జిల్లాలోని మాయాద్ లోయలో గల కార్పట్, చాగుంట్, ఉద్గోస్ నాలాలో మేఘావృతం కారణంగా సంభవించిన వరదల కారణంగా మరో రెండు వంతెనలు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
కార్పట్ గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని అధికారులు అలర్ట్ చేశారు. ఈ మేరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు జాతీయ రహదారులు సహా మొత్తం 325 రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం.. మండి జిల్లాలో 179, కులు జిల్లాలో 71 రోడ్లు ఉన్నాయి.
జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రూ.2,031 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. ఇక వర్ష సంబంధిత ఘటనల్లో 126 మంది మరణించారు. దాదాపు 36 మంది గల్లంతయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 63 ఆకస్మిక వరదలు, 31 క్లౌడ్‌బరస్ట్‌లు, భారీగా కొండచరియలు విరిగిపడిన ఘటనలు 57 చోటు చేసుకున్నాయి.
“𝙇𝙖𝙩𝙚 𝙉𝙞𝙜𝙝𝙩 𝙁𝙡𝙖𝙨𝙝 𝙁𝙡𝙤𝙤𝙙 𝙍𝙚𝙨𝙘𝙪𝙚 𝙊𝙥𝙨, 𝙆𝙞𝙣𝙣𝙖𝙪𝙧, 𝙃𝙞𝙢𝙖𝙘𝙝𝙖𝙡 𝙋𝙧𝙖𝙙𝙚𝙨𝙝”
A sudden flash flood at Hojis Lungpa Nala, triggered by a cloudburst in Rishi Dogri Valley, left 4 civilians stranded & one injured across Sutlej River, in Kinnaur… pic.twitter.com/phpWKQeKmw
— SuryaCommand_IA (@suryacommand) August 14, 2025
Also Read..
Actor Darshan | నటుడు దర్శన్‌కు భారీ షాక్.. బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు
Gallantry Awards | 1,090 మందికి కేంద్ర పతకాలు.. ప్రకటించిన హోం శాఖ
Elephant | ఏనుగు బీభత్సం.. పార్క్ చేసిన కారును ధ్వంసం చేసి.. VIDEO