Elephant | అస్సాంలో ఓ ఏనుగు (Elephant) బీభత్సం సృష్టించింది. గువాహటి (Guwahati)లో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారును ఢీ కొట్టి దాన్ని ధ్వంసం చేసింది (smashes parked car). ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటన ఆగస్టు 11న అమ్చాంగ్లో చోటు చేసుకుంది. జోరాబాత్, సత్గావ్ సహా ఇతర ప్రాంతాల్లో ఓ గాయపడిన ఏనుగు గత కొన్ని రోజులుగా తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గాయం బాధతో ఆ ఏనుగు స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. కనిపించిన వస్తువులను ధ్వంసం చేస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన పార్క్ చేసిన కారుపై దాడి చేసి ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఏనుగు దాడిలో ఆ కారు పూర్తిగా ధ్వంసమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
गुवाहाटी में गुस्साए हाथी का कार पर हमला | Assam Elephant Attack | Guwahati News
Watch Now – https://t.co/mPO3dkkXVD#AssamNews #Guwahati #ElephantAttack #WildlifeNews #BreakingNews #ElephantVideo #AnimalAttack #ViralVideo #ElephantInjured #IndiaNews pic.twitter.com/Q4q5ZaQlz9
— रफ्तार (Raftaar) (@raftaar) August 13, 2025
Also Read..
Oracle Layoffs | ఏఐ ఎఫెక్ట్.. ఒరాకిల్‌లో ఉద్యోగాల కోత..!
Instagram Influencer: 40 కోట్ల మనీల్యాండరింగ్.. ఇన్‌స్టా ఇన్ఫ్లుయన్సర్ను అరెస్టు చేసిన ఈడీ
ఈవీఎం గుట్టు రట్టు.. సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలు