Gallantry Awards | స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) పురష్కరించుకొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) గురువారం ప్రకటించింది. ఇందులో శౌర్య పురస్కారాలు, రాష్ట్రపతి విశిష్ట సేవ పతకాలు (President’s Medal), ప్రతిభగల సేవ పతకాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 1,090 మందికి మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను (Gallantry and Service Medals) అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది.
కేంద్ర హోం శాఖ ప్రకటించిన మొత్తం 1,090 పతకాల్లో 233 శౌర్య పతకాలు, 99 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 758 ప్రశంసనీయ సేవా పతకాలు ఉన్నాయి. విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అందించే శౌర్య పతకాల్లో అత్యధికం జమ్ముకశ్మీర్ సిబ్బందికే దక్కడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది ఉన్నారు.
పోలీసు విభాగంలో.. 226 మంది అధికారులు, సిబ్బంది శౌర్య పతకాలకు ఎంపికయ్యారు. 89 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవ పతకాన్ని అందించనున్నారు. ఇక 635 మంది ప్రతిభ చూపిన సేవ పతకాన్ని అందుకోనున్నారు. ఇక ఫైర్ సర్వీసెస్‌కు 62 అవార్డులు ప్రకటించారు. అందులో ఆరు శౌర్య పతకాలు, ఐదు రాష్ట్రపతి విశిష్ట సేవ పతకాలు, 51 ప్రశంసనీయ సేవా పతకాలు ఉన్నాయి. హోంగార్డు, సివిల్ డిఫెన్స్ విభాగంలో ఒక శౌర్య పతకం, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 41 ప్రశంసనీయ సేవా పతకాలు ఉన్నాయి.
కరెక్షనల్ సర్వీసెస్ (జైళ్ల శాఖ)లో ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట సేవ పతకం, 31 మందికి ప్రశంసనీయ సేవా పతకాలు అందించనున్నారు. తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు పతకాలన ప్రకటిస్తుంటుందన్న విషయం తెలిసిందే.
Also Read..
Elephant | ఏనుగు బీభత్సం.. పార్క్ చేసిన కారును ధ్వంసం చేసి.. VIDEO
Oracle Layoffs | ఏఐ ఎఫెక్ట్.. ఒరాకిల్‌లో ఉద్యోగాల కోత..!
Instagram Influencer: 40 కోట్ల మనీల్యాండరింగ్.. ఇన్‌స్టా ఇన్ఫ్లుయన్సర్ను అరెస్టు చేసిన ఈడీ