Cloudburst | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) చోటు చేసుకుంది. దీంతో కిష్త్వార్ (Kishtwar)లోని చోసిటీ (Chashoti)లో మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదలకు 12 మంది భక్తులు వరద ప్రవాహంలో చిక్కుకుని మరణించారు. స్థానిక మాచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది. మాచైల్ మాతా దర్శనం కోసం వెళ్లే క్రమంలో నది దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో చాలా మంది భక్తులు అక్కడ ఉన్నట్లు తెలిసింది. దీంతో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మాచైల్ మాతా యాత్ర (Machail Mata Yatra)ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
#WATCH | J&K | A flash flood has occurred at the Chashoti area in Kishtwar, which is the starting point of the Machail Mata Yatra. Rescue Operations have been started. pic.twitter.com/dQbUBx46A9
— ANI (@ANI) August 14, 2025
#WATCH | J&K | A flash flood has occurred at the Chashoti area in Kishtwar following a cloud burst. Rescue Operations have been started. pic.twitter.com/MKj5DQwrKK
— ANI (@ANI) August 14, 2025
Also Read..
IMD | రాబోయే మూడు గంటల్లో భారీ వర్షం : ఐఎండీ
Heavy Rain | ఢిల్లీలో వర్షబీభత్సం.. బైక్‌పై చెట్టు కూలడంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు