న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ మండుతున్నాయి. వంట గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్ రూ.809లకు లభిస్తుంది. పెట్రోల్ పంపులన్నీ ఆయిల్ సంస్థల నియంత్రణలో ఉండటంతో పెట్రోల్, డీజిల్‌లపై రాయితీలు పొందలేరు. కానీ ఎల్పీజీ సిలిండర్ మీద మాత్రం ఆ రాయితీ పొందొచ్చు. ప్రముఖ ఆన్ లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎం ఈ వసతి కల్పిస్తున్నది.
ఎల్పీజీ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి పేటీఎం భారీగా డిస్కౌంట్ అందిస్తున్నది. అది ఎంత అంటే రూ.800.. పేటీఎం ద్వారా తొమ్మిది రూపాయలు చెల్లిస్తే సరి రూ.800 డిస్కౌంట్ అందిస్తుంది.
పేటీఎం యాప్ ద్వారా తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.809 పేటీఎం ద్వారా చెల్లిస్తే తిరిగి క్యాష్ బ్యాక్ రూపంలో రూ.800 వస్తుంది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 31 వరకు మాత్రమే అమలులో ఉంటుంది.
పేటీఎం ద్వారా ఫస్ట్ టైం బుక్ చేసుకున్న ఎల్పీజీ సిలిండర్ల ఖాతాదారులకు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇలా బుక్ చేసుకున్న వారికి స్క్రాచ్ కార్డ్ వస్తుంది. దాన్ని తెరిస్తే అందులో రూ.800 క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఫస్ట్ టైం పేటీఎం ద్వారా బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, కనీసం రూ.500 చెల్లించాలి.
ఈ క్యాష్ బ్యాంక్ రేంజి రూ.10 నుంచి రూ.800 వరకు ఉంటుంది. మీకు వచ్చిన స్క్రాచ్ కార్డును ఏడు రోజుల్లో తెరిస్తేనే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ గడువు దాటిన తర్వాత స్క్రాచ్ కార్డు తెరిస్తే ఉపయోగం లేదు.
మీరు ఈ ఆఫర్‌ను అడ్వాండేజ్గా తీసుకోవాలని భావిస్తే, ముందు మీ మొబైల్ ఫోన్లో పేటీఎం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అటుపై మీ గ్యాస్ ఏజెన్సీతో సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఇందులో ‘షో మోర్’ ఆప్షన్ క్లిక్ చేసి రీచార్జితో బిల్లులు పే చేయాలి. ఆ తర్వాత సిలిండర్ బుకింగ్ ఆప్షన్ చూడాలి.
మీ గ్యాస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. బుకింగ్‌కు ముందు మీరు ఎఫ్ఐఆర్ఎస్టీఎల్పీజీ అనే ప్రొమో కోడ్ ఎంటర్ చేయాలి. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో క్యాష్ బ్యాక్ స్క్రాచ్ కార్డు మీకు వస్తుంది. ఏడు రోజుల్లోపు స్క్రాచ్ కార్డును వాడుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
బార్జ్ మునక : నాలుగో రోజు కొనసాగుతున్న అన్వేషణ
కాలికట్ చేరిన వాస్కోడిగామా.. చరిత్రలో ఈరోజు
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఇండియాలో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత? త్వరలో మరో కమిటీ ఏర్పాటు!!
గుజరాతీలకు మారుతి అండ: సీతాపూర్‌లో మల్టీ స్పెషాలిటీ దవాఖాన
క్రెడిట్ కార్డుల వాడకంతో ఇలా రివార్డు పాయింట్లు..!
అత్యంత ఖరీదైన కాన్వాయ్ ముఖేష్ అంబానీదే..
పీపీఎఫ్‌లో రూ.12 వేల మదుపు.. 15 ఏండ్లకు ఎంత లభిస్తుందంటే..