e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News Gold Rate | వ‌చ్చే దీపావ‌ళికి తులం బంగారం ధ‌ర రూ.52-53 వేలు?!

Gold Rate | వ‌చ్చే దీపావ‌ళికి తులం బంగారం ధ‌ర రూ.52-53 వేలు?!

Gold Rate | బంగారం అంటే మ‌హిళ‌ల‌కు ఎంతో ప్రీతి.. అందునా ఆభ‌ర‌ణాల కొనుగోలుకు భార‌తీయ వ‌నిత‌లు ప్రాధాన్యం ఇస్తుంటారు. ప్ర‌తియేటా దీపావ‌ళి.. దంతేరాస్‌.. అక్ష‌య తృతీయ సంద‌ర్భంగా బంగారం కొనుగోలు చేస్తే శుభ‌సూచ‌కం అన్న భావ‌న మ‌హిళ‌ల్లో ఎక్కువ‌. గ‌త మూడు దీపావ‌ళి పండుగ‌ల టైంలో బంగారం ధ‌ర‌లు ప్రియంగా మారాయి. కానీ వ‌చ్చే ఏడాది దీపావ‌ళి వ‌ర‌కు బంగారం ధ‌ర‌లు పెరిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. బులియ‌న్ వ‌ర్గాల అంచ‌నా ప్ర‌కారం వ‌చ్చే దీపావ‌ళి వ‌ర‌కు తులం బంగారం ధ‌ర రూ.52-53 వేల మ‌ధ్య ప‌లుకుతుంద‌ని భావిస్తున్నారు.

మార్కెట్‌లో తులం బంగారం రూ.48 వేలు

ప్ర‌స్తుతం తులం బంగారం ధ‌ర సుమారు రూ.48 వేలు ప‌లుకుతున్న‌ది. వ‌చ్చే దీపావ‌ళి నాటికి 10-15 శాతం పెరుగుతుంద‌ని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ పేర్కొంది. దీని ప్ర‌కారం ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ.52-53 వేల మ‌ధ్య త‌చ్చాడుతుంద‌ని తెలిపింది. గ‌తేడాది దీపావ‌ళి నుంచి ఈ ఏడాది దీపావ‌ళి వ‌ర‌కు మ‌ధ్య‌లో పెద్ద‌గా ప‌సిడి ధ‌ర పెరుగ‌లేద‌ని గుర్తు చేసింది.

బంగారానికి డిమాండ్‌పై ఫెడ్ రిజ‌ర్వ్ కీల‌కం

- Advertisement -

అంత‌ర్జాతీయ మార్కెట్లో ప్ర‌త్యేకించి అమెరికాలో డాల‌ర్‌, బాండ్ల మార్కెట్ అనిశ్చితిని ఎదుర్కొంటున్న‌ది. అందువ‌ల్లే బంగారం ధ‌ర‌లు ఓ మోస్త‌రుగా ఉన్నాయ‌ని బులియ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఏడాది ద్వితీయార్థంలో యూఎస్ బాండ్లు బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అమెరికా ఫెడ్ రిజ‌ర్వ్ త‌న వైఖ‌రిని మార్చుకోనుండ‌ట‌మే దీనికి కార‌ణం. ఒక‌వేళ బాండ్ల జారీ.. వాటి ధ‌ర‌వ‌ర‌ల‌పై ఫెడ్ రిజ‌ర్వు త‌న వైఖ‌రిని మార్చుకుంటే కొంత కాలం బంగారం ధ‌ర‌లు పైపైకి దూసుకెళ్తాయ‌ని బులియ‌న్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

వ‌డ్డీరేట్ల ఆధారంగా బంగారానికి గిరాకీ

వ‌డ్డీరేట్ల‌లో మార్పులు చేర్పులు బంగారంతో లావాదేవీల‌పై నేరుగా ప్ర‌భావం చూపుతాయి. వ‌డ్డీరేట్లు పెరిగిపోతే చాలా దేశాల కేంద్రీయ బ్యాంకులు.. బంగారం వంటి సుర‌క్షిత‌మైన ఆస్తుల‌పై పెట్టుబ‌డుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. చైనా రియాల్టీ సంస్థ ఎవ‌ర్‌గ్రాండే అప్పుల వివాదం ఇంకా ప‌రిష్కారం కాలేదు.. ప్ర‌పంచ దేశాల్లో ఇప్పుడిప్పుడే విద్యుత్ కొర‌త స‌మ‌స్య మొద‌లైంది. ఇక చైనా-అమెరికా మ‌ధ్య వాణిజ్యం బ‌లోపేతానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. న్యూ క‌రోనా వేరియంట్ల‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరిగిపోతున్న క‌రోనా కేసులు ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ఈ ప‌రిణామాల‌న్నీ మున్ముందు బంగారం ధ‌ర‌లు ప్రియ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

గ‌త రెండేండ్ల‌తో పోలిస్తే 2021లో స్థిరంగా ధ‌ర‌లు

2019, 2020ల్లో బంగారం ధ‌ర‌లు 52, 25 శాతం పెరిగాయి. 2021లో మాత్రం బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉండ‌ట‌మో.. ఒక మోస్త‌రుగా త‌గ్గ‌డ‌మో జ‌రిగింది. ఈ ఏడాది ప‌ది గ్రాముల బంగారం ధ‌ర రూ.47 వేల నుంచి రూ.49 వేల మ‌ధ్య త‌చ్చాడింది. బంగారం గిరాకీలో చైనా ఫ‌స్ట్‌. క‌రోనా త‌ర్వాత దేశీయంగా శ‌ర‌వేగంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. 2020తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో బంగారానికి 47 శాతం గిరాకీ ఎక్కువైంది. 2020 ద్వితీయ త్రైమాసికంలో 94.6 ట‌న్నుల బంగారం దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది 139 ట‌న్నుల‌కు దూసుకెళ్లింది. అలాగే జ్యువెల‌రీకి కూడా డిమాండ్ 58 శాతం ఎక్కువైంది. సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో 96.2 ట‌న్నుల వ‌ద్ద నిలిచింది. ఎకాన‌మీ పుంజుకోవ‌డంతోపాటు గిఫ్ట్‌లు ఇవ్వ‌డం కోసం బంగారం కొనుగోళ్ల‌కు డిమాండ్ పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

క‌రీంన‌గ‌ర్‌లోని ఈ గుట్ట‌ల‌ వల్లే తెలుగు భాష‌కు ప్రాచీన హోదా వచ్చిందా?

Mystery | ఈ ఊళ్లో ఒక‌రు పోతే.. వారంలో ఇంకొక‌రు చావాల్సిందే.. వంద‌ల ఏళ్లుగా ఇదే సీన్‌

కొండల్లో దారి తప్పిన వ్యక్తి.. ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తలేదు.. కారణం ఏం చెప్పాడంటే

116 ఏండ్లు గడిచినా చెక్కుచెదరని గడీ.. ఓ రైతు కట్టుకున్న ఇంద్ర భవనం ఎక్కడుందో తెలుసా?

33 ఏండ్లు మారుమూల‌ దీవిలో ఏకాంతవాసం.. ఇప్పుడు న‌గ‌రంలో కొత్త జీవితం..!

myrtle corbin | నాలుగు కాళ్లు.. రెండు జ‌న‌నేంద్రియాలు.. ఆమె పుట్టుక‌ ఇప్ప‌టికీ మిస్ట‌రీనే

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement