Grokipedia | అమెరికా బిలియనీర్, టెస్లాబాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరో సంచలనానికి తెర తీశారు. ముందుగా ప్రకటించినట్లుగానే ‘వికీపీడియా’ (Wikipedia)కి పోటీగా గ్రోకిపీడియా(Grokipedia) పేరుతో కొత్త ఎన్సైక్లోపీడియాను పరిచయం చేశారు. ఏఐ (కృత్రిమ మేధ) సాంకేతికతతో పనిచేసే దీని బీటా వెర్షన్ను నేడు అందుబాటులోకి తెచ్చారు. ఈ విషయాన్ని మస్క్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. వికీపీడియా కంటే పది రేట్లు ఎంతో బెటర్ అంటూ వెల్లడించారు.
వికిపీడియా తరహాలో అంతకంటే మెరుగైన గ్రోకిపీడియా (Grokipedia)ను డెవలప్ చేస్తున్నట్లు మస్క్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. వికీపీడియా కంటే అతిభారీగా ఉంటుందన్నారు. విశ్వాన్ని అర్థం చేసుకునే లక్ష్యంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికీపీడియా కన్నా చాలా విశ్వసనీయమైన, పారదర్శకమైన, భిన్నమైన, కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో గ్రోకిపీడియాను తయారు చేస్తున్నట్లు మస్క్ తెలిపారు. ఇవాళ దాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది ప్రారంభమైన కాసేపటికే భారీ ట్రాఫిక్ కారణంగా క్రాష్ అయ్యింది. దీంతో కాసేపటికి సేవల్ని పునరుద్ధరించారు. ఇది వికీపీడియా కంటే కొత్తగా ఏమీ లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
Amazon | భారీగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన అమెజాన్.. కంపెనీ చరిత్రలోనే..!
Gold Rates | మరింత దిగొచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారుల్లో ఉత్సాహం
49 శాతానికి ఎఫ్డీఐలు.. విదేశీ గుప్పిట్లోకి సర్కార్ బ్యాంకులు!