e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News క‌రోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థిక‌వేత్తల అంచ‌నా

క‌రోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థిక‌వేత్తల అంచ‌నా

క‌రోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థిక‌వేత్తల అంచ‌నా

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విల‌య‌తాండ‌వం చేస్తున్నప్పటికీ దేశ జీడీపీ వృద్ధి రెండంకెల్లో ఉంటుందని ఆర్థిక‌వేత్త‌లు అంచ‌నావేస్తున్నారు. రేప‌టి నుంచి ప్రారంభ‌మ‌య్యే ఆర్థిక సంవ‌త్స‌రంలో భాత‌ర‌ ఆర్థిక వ్యవస్థ 10 శాతం వృద్ధి చెందుతుంద‌ని వారంటున్నారు. 12 మంది ఆర్థికవేత్తల అంచనాల ఆధారంగా బ్లూమ్‌బెర్గ్ ఈ విషయం వెల్ల‌డించింది. ఏదేమైనా, కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో విధించిన ఆంక్షలతో కొంతమంది ఆర్థికవేత్తలు కూడా వారి అంచనాలను తగ్గించారు.

గత సంవత్సరం కరోనా ఇన్‌ఫెక్ష‌న్ కారణంగా దాదాపు రెండు నెలలు కఠినమైన లాక్‌డౌన్ అమలులో ఉంది. దీని తర్వాత‌ ఆర్థిక వ్యవస్థను ప్రారంభించినప్పుడు.. మొబైల్ ఫోన్ల నుంచి కార్ల వరకు అన్ని వస్తువులకు డిమాండ్ పెరిగింది. గత నెలలో అనేక రాష్ట్రాలు తమ స్థాయిలో లాక్‌డౌన్ స్థాయిని పెంచాయని బ్లూమ్‌బెర్గ్ ఆర్థిక‌వేత్త‌లు చెప్పారు. దీని నుంచి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను తేలికగా తీసుకోకూడదనే సందేశం ఉన్న‌ది. రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించడం రికవరీ బలాన్ని వేగవంతం చేస్తుందని ఆర్థికవేత్తలు అంటున్నారు.

జూన్ నుంచి కొన్ని ప్రాంతాల్లో తెరిచే అవ‌కాశం..

కరోనా కేసులు తగ్గడం ప్రారంభమయ్యాయని ఇండియా ఎకనామిస్ట్ అభిషేక్ గుప్తా చెప్పారు. అటువంటి పరిస్థితిలో జూన్ నుంచి దేశంలోని కొన్ని ప్రాంతాలు తెరుచుకోవ‌చ్చు. అయినప్పటికీ, వినియోగదారులు స్వేచ్ఛగా ఖర్చు చేసే అవకాశం లేదు. ఇది ఆర్థిక అనిశ్చితి, నిరుద్యోగానికి కారణమవుతుంది. కుటుంబాలు ఖర్చు కంటే పొదుపును ఇష్టపడుతున్నాయ‌ని క్వాంటికో రీసెర్చ్ ఆర్థికవేత్త యువికా సింఘాల్ చెప్పారు.

డిమాండ్‌పై కొవిడ్‌ ప్రభావం

కొవిడ్ -19 సెకండ్ వేవ్ డిమాండ్‌పై అతిపెద్ద ప్రభావాన్ని చూపిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెల ప్రారంభంలో తెలిపింది. దీంతో పాటు చైతన్యం, ఖర్చు చేయకపోవడం, ఉపాధి కూడా ప్రభావితమయ్యాయి. ఈ వారం వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ సమీక్షిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మారకుండా ఉంచగలదని ప‌లువురు భావిస్తున్నారు.

భారతదేశంలో కొవిడ్ -19 సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య తగ్గడం ప్రారంభమైందని బార్క్లేస్ ఆర్థికవేత్త రాహుల్ బజోరియా అన్నారు. అయినప్పటికీ, ఆర్థిక నష్టం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండవచ్చు. టీకాలు నెమ్మదిగా ఇవ్వ‌డం, లాక్‌డౌన్ విధించడం కూడా భారతదేశ ఆర్థిక పునరుద్ధరణపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కొవిడ్ థ‌ర్డ్ వేవ్‌ను భారత్ ఎదుర్కొన్న‌ప‌క్షంలో.. వృద్ధి 7.7 శాతానికి పడిపోతుందని బజోరియా చెప్పారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ముంబైలో కొత్త బంగ్లా కొన్న‌ అజ‌య్ దేవ‌గ‌న్‌

ఆర్థిక ఇబ్బందుల‌తో స‌ర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు

సిగ‌రెట్ స్మోకింగ్‌తో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎన్నో..!

మువ్వ‌న్నెల జెండాకు కాంగ్రెస్ గుర్తింపు.. చ‌రిత్ర‌లో ఈరోజు

జూలై 4 నుంచి ఇమ్రాన్ ఖాన్‌కు వ్య‌తిరేకంగా పీడీఎం దేశవ్యాప్త ఆందోళ‌న‌

బీఎండ‌బ్ల్యూ నుంచి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. ఆక‌ర్శ‌ణీయ‌మైన డిజైన్‌

ఎల్ఓసీపై 3 నెల‌లుగా ఒక్క బుల్లెట్ పేల‌లేదు : జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వ‌ణె

వానాకాలం క‌రోనా వైర‌స్‌తో జాగ్ర‌త్త‌.. ఇవి పాటించండి..!

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా ఉన్నా రెండంకెల్లో దేశ జీడీపీ వృద్ధి.. ఆర్థిక‌వేత్తల అంచ‌నా

ట్రెండింగ్‌

Advertisement