Amritsar | పార్కింగ్ విషయంలో గొడవ.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై కాల్పులు.. తీవ్ర గాయాలు
Amritsar : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై పొరుగింటి వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Amritsar : పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతపై పొరుగింటి వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్సర్ పట్టణంలోని ఒక వార్డుకు జైపాల్ సింగ్ బాహు అనే నేత ఆమ్ ఆద్మీ పార్టీ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. కోట్ ఆత్మా రామ్ ప్రాంతంలో ఉండే అతడికి, పొరుగింటి వ్యక్తికి మధ్య పార్కింగ్ విషయంలో గురువారం మధ్యాహ్నం వివాదం చెలరేగింది.
అది పెరిగి ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఒకరిని ఒకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి తన గన్ తీసుకొచ్చి జైపాల్ సింగ్ బాహుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి ఒంట్లోంచి బుల్లెట్లు దూసుకుపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, కీలకమైన అవయవాలకు ఎలాంటి హానీ కలగలేదని చెప్పారు. ఏ అవయవాన్ని తాకకుండానే బుల్లెట్ బయటకు వెళ్లిందన్నారు. ప్రస్తుతానికి అతడికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు.
🚨 Punjab’s law and order situation now appears to be in complete disarray! 🚨
👉 In Amritsar, @AamAadmiParty Ward No. 42 in charge Jaipal Singh Bau was shot at in broad daylight and was rushed to Amandeep Hospital, Amritsar, in an injured condition.
👉 At times, uniformed… pic.twitter.com/rTZFqtoOzG
— Bikram Singh Majithia (@bsmajithia) May 28, 2026
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుడు జైపాల్ సింగ్ బాహు.. స్థానిక ఆప్ ఎమ్మెల్యే ఇంద ర్బీర్ సింగ్ నిజ్జార్‌కు సన్నిహితుడు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

