Farmer | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఓ వైపు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే పట్టించుకునే అధికార యంత్రాంగం కరువైతే.. మరోవైపు ఇదే అదనుగా భావించిన మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రైతన్నల జేబులు గుళ్ల చేస్తున్నారు.
ప్రభుత్వం అసమర్థ, నిర్లక్ష్యంతో మిల్లర్లు రైతులను నిండా ముంచుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామంలోని ఓ రైస్ మిల్లు యాజమాన్యం ఒక్క క్వింటాల్ ధాన్యానికి నిబంధనలకు విరుద్దంగా ఇష్టారీతిన 19 కిలోల తరుగు తీస్తోంది.
తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం అన్ లోడ్ చేస్తామని మిల్లు యాజమాన్యం చెప్తున్నారని, తన జీవితంలో ఇంత దోపిడి చూడలేదని రైతు తిరుపతయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వైపు ప్రభుత్వం పట్టించుకోక, మరోవైపు మిల్లర్లు, దళారుల చేతిలో రైతన్నలు ఎలా దోపిడీకి గురవుతున్నారో ఈ వీడియో మరోసారి రుజువు చేస్తోంది.
క్వింటాల్ ధాన్యానికి 19 కిలోల తరుగు
ప్రభుత్వం అసమర్థతో రైతులను నిండా ముంచుతున్న మిల్లర్లు
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు గ్రామంలోని ఓ రైస్ మిల్లులో ఒక్క క్వింటాల్ ధాన్యానికి 19 కిలోల తరుగు తీస్తున్న యాజమాన్యం
తరుగుకు ఒప్పుకుంటేనే ధాన్యం అన్ లోడ్ చేస్తామని… pic.twitter.com/CymDYFYLfa
— Telugu Scribe (@TeluguScribe) May 28, 2026