‘కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు’
అకాల వర్షాల భయంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. పండించిన ధాన్యం ఎక్కడ తడిసి నష్టపోతుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ధాన్యాన్ని ఆరబెట్టి తూర్పారబోసి కాటా పెట్టకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే ఉండి..
చుంచుపల్లి, మే 28 : అకాల వర్షాల భయంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. పండించిన ధాన్యం ఎక్కడ తడిసి నష్టపోతుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ధాన్యాన్ని ఆరబెట్టి తూర్పారబోసి కాటా పెట్టకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే ఉండి ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. గురువారం ఉదయం చుంచుపల్లి మండలం పెనగడప రాంపురం వద్ద పీఏసీఎస్ సంఘం వాళ్లు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కురిసిన గాలివాన రైతులకు మరింత ఆందోళన కలిగించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై కప్పిన పట్టాలపై వర్షపు నీరు నిలవడంతో రైతులు వాటిని తొలగించి మళ్లీ ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
భారీ వర్షాలు కురిస్తే ధాన్యం పూర్తిగా తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని త్వరగా కాటా పెట్టి లారీల ద్వారా మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. ఆలస్యం కొనసాగితే వర్షాల కారణంగా ధాన్యం నాణ్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

‘కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు’
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

