Gold Rates | ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు (Gold Rates) కాస్త బ్రేక్ పడింది. ధన త్రయోదశి ముందు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,410గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,690 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న హైదరాబాద్లో రూ. రూ.1.82 లక్షలకు తగ్గిన కిలో వెండి.. ఇవాళ రూ.1,86,000గా ఉంది.
2025లో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 50 శాతానికి పైగానే ధరలు పెరిగాయి. 2022తో పోలిస్తే మొత్తం పెరుగుదల 140 శాతానికి చేరుకుంది. ఈ నెల 18న ధనత్రయోదశి వస్తున్నది. ఈ రోజున బంగారం, వెండి కొనుగోళ్లు శుభప్రదమని దేశంలోని మెజారిటీ ప్రజల విశ్వాసం. అయితే మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.. అప్పటికల్లా రేట్లు ఇంకా పెరిగిపోవచ్చన్న అంచనాలైతే ఉన్నాయి.
Also Read..
మళ్లీ ప్రభుత్వ బ్యాంకుల విలీనం?.. త్వరలో కనుమరుగవనున్న ఐవోబీ, బీవోఐ, బీవోఎం!
రూపాయికే నెల రోజులు ఫ్రీ.. బీఎస్ఎన్ఎల్ దివాలీ ఆఫర్
ఎల్ఐసీ సరికొత్త ప్లాన్లు… జన్ సురక్ష, బీమా లక్ష్మి పాలసీలు పరిచయం