న్యూఢిల్లీ, అక్టోబర్ 15 : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్..దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని కొత్త 4జీ యూజర్లకు నెలరోజులపాటు ఉచితంగా సర్వీసులు అందించనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రూపాయి చార్జీని విధించనున్నది. వచ్చే నెల 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనున్నదని ఒక ప్రకటనలో వెల్లడించింది. నూతన కస్టమర్లకు 30 రోజులపాటు అన్లిమిటెడ్ వాయిస్‌కాల్స్, రోజు 2జీబీ డాటా, 100 ఎస్ఎంఎస్లు, సిమ్‌ను ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది.
ఇలాంటి ఆఫర్ ఆగస్టు నెలలో ప్రకటించడంతో నూతన కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందని, దీంతో కొత్తగా 1.38 లక్షల మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లు చేరారని తెలిపింది. నూతన కస్టమర్లకు 4జీ అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నూతన ఆఫర్‌ను తెరపైకి తీసుకొచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఏ రాబర్ట్ జే రవి తెలిపారు.