ముంబై, అక్టోబర్ 15 : ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. బుధవారం రెండు సరికొత్త బీమా పాలసీలను పరిచయం చేసింది. కంపెనీ సీఈవో, ఎండీ ఆర్ దొరైస్వామి చేతులమీదుగా జన్ సురక్ష (యూఐఎన్: 512ఎన్388వీ01), బీమా లక్ష్మి (యూఐఎన్: 512ఎన్389వీ01) ప్లాన్లను ప్రారంభించింది. బీమాపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఎత్తివేసిన తర్వాత ఎల్ఐసీ నుంచి వచ్చిన పథకాలు ఇవే కావడం గమనార్హం. కాగా, ప్రస్తుతం మార్కెట్లో వడ్డీరేట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న నేపథ్యంలో పాలసీదారులకు కాలవ్యవధి మొత్తంగా నమ్మకమైన రాబడులను అందించేలా ఈ ప్లాన్లను ఎల్ఐసీ రూపొందించడం విశేషం. ఇక ఈ రెండు ప్లాన్లలోనూ పూర్తిగా మూడేండ్లపాటు ప్రీమియంలను చెల్లించినైట్టెతే ఆటో కవరేజీ సదుపాయం కూడా ఉన్నది. ఎల్ఐసీ విడుదల చేసిన ఓ ప్రకటన ఆధారంగా పాలసీల వివరాల్లోకి వెళ్తే..