Audi Cars Price Hike | మారుతి బాటలోనే ఆడి.. 3% ధరలు పెంపు!
Audi Cars Price Hike | జర్మనీ కార్ల దిగ్గజం ఆడి .. ఇన్పుట్, ఆపరేషనల్ కాస్ట్ పెరగడంతో తమ కార్ల ధరలు 3% పెంచుతున్నట్లు తెలిపింది.

Audi Cars Price Hike | ఇన్పుట్ కాస్ట్ పెరిగిందంటూ మరోదఫా కార్ల ధరలు పెంచేందుకు కార్ల తయారీ సంస్థలు సిద్ధం అయ్యాయి. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి వచ్చే జనవరి నుంచి అన్ని మోడల్ కార్లపై మూడు శాతం వరకు ధరలు పెంచనున్నట్లు గురువారం ప్రకటించింది. ఇన్పుట్, ఆపరేషనల్ కాస్ట్ పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదంటూ వ్యాఖ్యానించింది.
భారత్‌లో ఏ4, ఏ6, ఏ8 ఎల్, క్యూ2, క్యూ8, ఎస్5 స్పోర్ట్‌బ్యాక్, ఆర్ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్, ఆర్ఎస్ 7, ఆర్ఎస్ క్యూ8, ఈ-ట్రాన్ 50, ఈ-ట్రాన్ 55, ఈ-ట్రాన్ స్పోర్ట్ బ్యాక్ 55, ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ మోడల్ కార్లను విక్రయిస్తోంది. సుస్థిర వ్యాపార నమూనాపైనే ఆడి ఇండియా వ్యూహం దృష్టి పెట్టిందని, కానీ ఇన్పుట్, ఆపరేషనల్ కాస్ట్స్ పెరిగిపోవడంతో ధరల పెంచక తప్పడం లేదని వ్యాఖ్యానించింది.
ఎంపిక చేసిన మోడల్ కార్లపై నూతన ధరలు ప్రకటిస్తామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఆడి ఇండియా దేశంలో తొమ్మిది నూతన మోడల్ కార్లను ఆవిష్కరించింది. వాటిలో ఐదు విద్యుత్ కార్లే కావడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఇప్పటికే మారుతి సుజుకి వచ్చేనెల మొదటి నుంచి తమ కార్ల ధరలు పెరుగనున్నాయని గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- audi cars
- price hike
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

