Ambanis Party | అపర కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ ఇంట్లో ఏం జరిగినా విశేషమే. చిన్న పార్టీ జరిగినా సరే వార్తల్లోకి ఎక్కేస్తుంటుంది. అలాంటిది అంబానీ ఇంట్లో మూడురోజుల పాటు గ్రాండ్ పార్టీ అంటే..? ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్ట్ (Dream Project) అయిన ‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (Nita Mukesh Ambani Cultural Centre) గత శుక్రవారం ముంబై (Mumbai) లోని జియో వరల్డ్ సెంటర్ (Jio World Centre)లో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు ఈ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలు తరలివచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా అతిథులకు అంబానీ కుటుంబం కళ్లు చెదిరే ఆతిథ్యం ఇచ్చింది.
అంబానీ పార్టీలో అతిథులకు ఎన్నో ప్రత్యేక వంటకాలను వడ్డించినట్లు తెలుస్తోంది. వెండి ప్లేట్స్‌లో పాలక్ పన్నీర్, పప్పు, కూర, రోటీ, హల్వా, డిజర్ట్, పాపడ్, లడ్డు వంటి పలు రకాల భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డించారట. ఇంత వరకూ బాగానే ఉన్నా భోజనం తర్వాత అందించిన స్వీట్ ప్లేట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. అతిథులకు ఎంతో ఖరీదైన ‘దౌలత్ కి చాట్’ (Daulat Ki Chaat) ను సర్వ్ చేశారు. వడ్డించడానికి రెడీగా ఉంచిన ఆ స్వీట్ ప్లేట్లలో టిష్యూలకు బదులు కరెన్సీ నోట్లు (Currency Notes) ఉండటం ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. అయితే అవి నిజమైన కరెన్సీ నోట్లు కాదని తేలింది.
‘దౌలత్ కి చాట్’.. ఢిల్లీ సహా నార్త్ ఇండియా (North India)లో బాగా ఫేమస్ అయిన డిజర్ట్. ఈ డిష్ శీతాకాలంలో మాత్రమే రెండు నెలల పాటు లభిస్తుంది. చిక్కటి పాల నుంచి తీసిన నురుగుతో పాటు పిస్తా, కోవా, చక్కెర పొడితో దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. దిల్లీకి చెందిన ‘ఇండియన్ అసెంట్’ (Indian Accent) అనే రెస్టారంట్ ఈ డిజర్ట్‌తో పాటు నకిలీ కరెన్సీ నోట్ల (Facke Currency Notes)ను పెట్టి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. దీంతో ఈ వంటకం నార్త్‌లో చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు అంబానీ పార్టీలో కూడా ‘దౌలత్ కి చాట్’ డిజర్ట్‌ను ఫేక్ కరెన్సీ నోట్లతో సర్వ్ చేశారన్నమాట. ఇందుకు సంబంధించిన ఫొటోను రత్నిష్ (RATNISH) అనే నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘అంబానీల పార్టీలో టిష్యూ పేపర్లకు బదులుగా రూ.500 నోట్లు వడ్డిస్తారు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Ambani ji ke party mein tissue paper ki jagah 500 ke notes hote hain 😭 pic.twitter.com/3Zw7sKYOvC
— R A T N I S H (@LoyalSachinFan) April 2, 2023
Also Read..
India Corona | వరుసగా మూడోరోజూ 3వేలకు పైనే కొత్త కేసులు.. 20వేలు దాటిన యాక్టివ్ కేసులు
Karnataka | షాకింగ్ ఘటన.. నవజాత శిశువును నోటితో ఈడ్చుకెళ్లిన వీధి కుక్క
Kerala | దారుణం.. తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన వ్యక్తి.. ముగ్గురు మృతి
McDonalds | ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన మెక్‌డొనాల్డ్స్..!