McDonalds | ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీల్లో లేఆఫ్స్ (layoffs) పర్వం కొనసాగుతోంది. పలు కారణాలతో గూగుల్ (Google) , మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon), ట్విట్టర్ (Twitter), లింక్డిన్ (LinkedIn), మెటా (Meta) వంటి టెక్ దిగ్గజాలు (tech Companies) ఒకదాని తర్వాత ఒకటి సంస్థలోని ఉద్యోగులను ఇప్పటికే తొలగించాయి. పలు కంపెనీలు ఇంకా లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ కంపెనీల్లో ఒకటైన మెక్‌డొనాల్డ్స్ (McDonalds) తాజాగా తమ ఉద్యోగుల తొలగింపు (Layoffs)కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
సంస్థలోని కార్పొరేట్ ఉద్యోగుల్లో (corporate employees) కొంత మందికి ఉద్వాసన పలకనున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) ఓ కథనం ప్రచురించింది. ఉద్యోగుల తొలగింపులో భాగంగానే అమెరికాలోని పలు కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు పేర్కొంది. సోమవారం నుంచి బుధవారం వరకు ఇంటి నుంచి పని చేయడం ప్రారంభించాలని కంపెనీ గత వారం తన యూఎస్ ఉద్యోగులకు మెయిల్ పంపినట్లు వాల్‌స్ట్రీట్ తన కథనంలో పేర్కొంది. ఉద్యోగుల తొలగింపుల కోసమే మెక్‌డొనాల్డ్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అయితే, మెక్‌డొనాల్డ్స్ ఎంత మంది ఉద్యోగుల్ని తొలగిస్తుందనే దానిపై స్పష్టత లేదు. ఏప్రిల్ మూడో వారంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తెలియజేస్తామని మెక్‌డొనాల్డ్స్ మెయిల్లో పేర్కొంది. ఈ వారంలో షెడ్యూల్ చేయబడిన అన్ని వ్యక్తిగత సమావేశాలను రద్దు చేయాలని కూడా ఉద్యోగులను కోరింది. కాగా బుధవారం నాటికి ఉద్యోగుల తొలగింపు ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Rahul Gandhi | అనర్హత కేసులో నేడు సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ
Janhvi Kapoor | శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్