Kerala | దారుణం.. తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన వ్యక్తి.. ముగ్గురు మృతి
Kerala | కేరళ (Kerala)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోజికోడ్ (Kozhikode) జిల్లా ఎలత్తూర్ ( Elathoor) సమీపంలో కదులుతున్న రైలు (Moving Train)లో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Kerala | కేరళ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోజికోడ్ (Kozhikode) జిల్లా ఎలత్తూర్ ( Elathoor) సమీపంలో కదులుతున్న రైలు (Moving Train)లో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అలప్పుళ-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు ( Alappuzha-Kannur Executive Express train )లో ఆదివారం రాత్రి 10గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు కోజికోడ్ (Kozhikode) నగరం దాటి కోరపుజ రైల్వే వంతెన వద్ద (Korapuzha railway bridge)కు చేరుకోగానే డీ1 కంపార్ట్మెంట్లోని ఓ గుర్తు తెలియని వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే మంటలు తోటి ప్రయాణికులకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన తర్వాత రైల్లో నుంచి ముగ్గురు ప్రయాణికులు కనిపించలేదని తోటివారు గుర్తించారు. వారి కోసం గాలింపు చేపట్టగా ఘటన జరిగిన సుమారు 100 మీటర్ల దూరంలోని రైల్వే ట్రాక్‌పై వారి మృతదేహాలు కన్పించాయి. ఏడాది చిన్నారి సహా, ఒక మహిళ, ఓ పురుషుడి మృతదేహాలను ట్రాక్‌పై గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలుస్తోంది. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నారు.
Also Read..
Uddhav Thackeray | మోదీకి ఏ డిగ్రీ ఉంది? ఏ కాలేజీ నుంచి పట్టా పొందారు..? : ప్రశ్నించిన ఉద్ధవ్
Rahul Gandhi | అనర్హత కేసులో నేడు సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ
McDonalds | ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన మెక్‌డొనాల్డ్స్..!
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

