కొత్తగూడెం: దసరా పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపి విజయాలు చేకూర్చాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. దసరా పండుగను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఊరూ, వాడా, చిన్నా,పెద్ద తేడా లేకుండా తొమ్మిది రోజుల పాటు ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి బతుకమ్మ పాటలకు కోలాటాలు, నృత్యాలతో ఎంతో సందడి చేశారని అన్నారు.
విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఈ దసరా పండుగ జిల్లా ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని, అభివృద్ధిలో మన జిల్లా ఆదర్శంగా నిలవాలని, అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.