శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - May 29, 2020 , 00:45:45

కరోనా కట్టడికి ఇంటింటి సర్వే

 కరోనా కట్టడికి ఇంటింటి సర్వే

భద్రాద్రి జిల్లాలో రెండో విడుత ప్రారంభం

క్వారంటైన్‌లో ఉన్న వారిపై నిరంతర నిఘా

జిల్లాలో గృహ నిర్బంధంలో 1925 మంది

కొత్తగూడెం:కరోనా వైరస్‌ కట్టడికి వైద్యారోగ్యశాఖ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ అధికారులకు, వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటే నియంత్రణలో మనం ముందుంటామని తేల్చి చెప్పడంతో ఆరోగ్యశాఖ ఇంటింటి సర్వేకి శ్రీకా రం చుట్టింది. జిల్లాలోని ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు కలిసి ఇంటింటి సర్వే చేస్తున్నారు. గతంలో చేసిన సర్వేకాకుండా కొత్తగా చేస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసంతో పాటు దీర్ఘ కాలిక వ్యాధులు ఉంటే గుర్తించి అవసరమైన వారిని స్థానిక పీహెచ్‌సీ, ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన సర్వేలో కొవిడ్‌ -19 టీం పకడ్బందీగా పనిచేస్తోంది. ఇతర రాష్ర్టాల నుంచి సొంతూళ్లకు చేరుకున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారిని హోం క్వారంటైన్‌లోనే ఉంచు తున్నారు. జిల్లాలోని వెయ్యిమందికి పైగా ఇతర రా ష్ర్టాల నుంచి వచ్చినట్లు గుర్తించి వారికి స్టాంపింగ్‌ చేశారు. వారు ఇంట్లో నుంచి బయటికి రాకుండా చూస్తున్నారు.

ఇంటింటి సర్వేలో ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు..

లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటి సర్వే ప్రారంభించారు. తొలిరోజుల్లో ఆశలు, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు కలిసి పూర్తిస్థాయి సర్వే చేసి ఇతర ప్రాంతాల నుంచి వ చ్చిన వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. అప్పట్లో క్వారంటైన్‌ స మయం పూర్తైన తర్వాత లాక్‌డౌన్‌లో సడలింపులు రావడం వల్ల దూర ప్రాంతాల నుంచి చాలా మంది స్వగ్రామాలకు చేరుకున్నారు. చాలా మంది హైదరాబాద్‌, ఇతర రాష్ర్టాల నుంచి పట్టణాలు, పల్లెలకు చేరుకోవడంతో సర్వేను మరింత విస్తృతం చేశారు. కొవిడ్‌ టీం పేరుతో వేసిన ప్రత్యేక బృందాల్లోని సిబ్బంది ఇంటింటికీ వెళ్లి దారు ఎక్కడినుంచి వచ్చారో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే గుర్తించిన వారిని హోంక్వారంటైన్‌ చేసి ఇంటికే పరిమితం చేశారు. గ్రామం, మండలం, వార్డు, పట్టణాల్లో ఉండే వారిపై స్థానిక ప్రత్యేక అధికారుల సలహాలు, వైద్యుల సూచనల మేరకు అవసరాన్ని బట్టి  నిఘా ఉంచారు. 

జిల్లా కేంద్రంపై ప్రత్యేక నిఘా..

 కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రత్యేక నిఘా పెట్టాం. ఎవరు ఏ సమయంలో గుట్టుచప్పుడు కాకుండా వ చ్చినా సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్లు తెలిస్తే వారికి స్టాంపింగ్‌ వేసి వారి ఇంటికి పోస్టర్‌ వేసి వారిని హోం క్వారంటైన్‌ చేస్తు న్నాం. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నా యి. వాటిని తప్పకుండా పాటిస్తున్నాం.

     -పొన్నెకంటి సంజీవరాజు, అర్బన్‌ కొవిడ్‌ టీమ్‌ ఇన్‌చార్జి

1925మంది హోంక్వారంటైన్‌లో ఉన్నారు.. 

       జిల్లాలో కొవిడ్‌ నివారణ కోసం కలెక్టర్‌ నియమించిన సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తున్నారు. ఎక్కడ నుంచి వచ్చినా వారి అడ్రస్‌ సేకరించి వారి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న 1925 మందికి ప్రతిరోజు చెకప్‌ చేసి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేస్తున్నాం. జిల్లా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అప్రమత్తంగా ఉండటం వల్ల చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని కట్టడి చేయగలిగాం.

-డాక్టర్‌ చేతన్‌, కొవిడ్‌ ప్రత్యేక అధికారి