మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 25: మెదక్ పట్టణంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ధ్యాన్‌చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో (రోడ్‌షో) మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాదిగా బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడంతో పట్టణమంతా గులాబీమయమైంది. పట్టణ ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయి. జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై హరీశ్‌రావు అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మహిళలు బోనాలు, సాంస్కృతిక కళాకారులు ఆటపాటలతో ధూంధాం చేశారు. ముఖ్యంగా యువత ఈలలు వేస్తూ కేరింతలు, చప్పట్లతో బీఆర్ఎస్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతకుముందు పట్టణంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు.
పలు నియోజకవర్గ కేంద్రాల నుంచి బీఆర్ఎస్ యువత బైక్ ర్యాలీలతో తరలివచ్చారు. ర్యాలీలో ఓపెన్ టాప్ వాహనంపై మాజీమంత్రి హారీశ్రావుతో పాటు ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, యాదవరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, ఏఎంసీ మాజీచైర్మన్ బట్టి జగపతి, పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తదితరులు ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు.
ర్యాలీకి ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తరలిరావడంతో బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నింపింది. ర్యాలీలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కౌన్సిలర్లు సుంకయ్య, కిశోర్, రాజు, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, కో కన్వీనర్ గడ్డమీది కృష్ణాగౌడ్, మాజీ కౌన్సిలర్లు పెర్క కిషన్, గౌష్ ఖురేషి, సాధిక్, చంద్రశేఖర్ గౌడ్, సలీం, గట్టేశ్, నగేశ్, బాలరాజు, ముకుందం, కిష్టయ్య, అంజాగౌడ్, సంగ శ్రీకాంత్, కిషన్‌గౌడ్, కిరణ్, ఏనుగుల రాజు, చింతల నర్సింహులు, అజ్గర్ అలీ తదితరులు పాల్గొన్నారు.