Vinayaka Chavithi | వినాయక చవితి వచ్చేసింది.. రకరకాల గణేశుడి ప్రతిమలు మండపాల్లో కొలువు తీరేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే విభిన్న గణపతులు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ముఖ్యంగా అనంతపురం జిల్లా పామిడిలో ఏర్పాటుచేసిన వెరైటీ గణపతి విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటుంది.
అనంతపురం జిల్లా పామిడిలో రెగ్యులర్‌గా కాకుండా సబ్బులు, శాంపూలతో గణేశుడి విగ్రహాన్ని తయారుచేశారు. సంతూర్ సబ్బులతో బొజ్జగణపయ్య విగ్రహాన్ని తయారు చేయగా.. లక్స్ సబ్బులతో చెవులు, సింతాల్ సబ్బులతో కాళ్లను రూపొందించారు. మీరా షాంపూలతో దంతాలను తయారుచేశారు. ఇక సన్‌సిల్క్, కార్తిక షాంపూలతో పాటు కంఫర్ట్ ప్యాకెట్లను హారాలుగా మలిచారు. ఇలా సంతూర్, లక్స్ సబ్బులతో పాటు శాంపూలతో తయారుచేసిన గణేశుడు అనంతపురం జిల్లాలో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహం తయారీకి రూ.25 వేల వరకు ఖర్చయినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు.
అనంతపురం జిల్లా పామిడిలో సబ్బులు, షాంపూలతో ఏర్పాటు చేసిన గణేశుడి ప్రతిమ
Follow Us : on Facebook, Twitter
Srisailam | ఆ మూడు భవనాలు ఖాళీ చేయండి.. శ్రీశైలం దేవస్థానం రిక్వెస్ట్..
Free Current | గణేశ్ మండపాలకు ఫ్రీ కరెంట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Government Job | ఒకే ఇంట్లో నలుగురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు