Chiranjeevi | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నటుడు చిరంజీవి శనివారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలిపి.. వరద సాయం చెక్కును ఏసీ సీఎం చంద్రబాబుకు చిరంజీవి అందజేశారు. సీఎంఆర్ఎఫ్కు చిరంజీవి రూ. కోటి విరాళం అందించారు. చిరంజీవి తరపున రూ. 50 లక్షల చెక్కును, రామ్చరణ్ తరపున రూ. 50 లక్షల చెక్కును చంద్రబాబుకు చిరంజీవి అందించారు. ఈ భేటీ హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో జరిగింది.
ఇటీవలి వరదలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. బుడమేరు ఉద్ధృతితో విజయవాడ నగరం ముంపునకు గురైంది. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. వరద బాధితులకు ఆర్థిక సాయం అందిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Jani Master | బిగ్ బ్రేకింగ్.. జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
Woman Molest | కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం