Jani Master | హైదరాబాద్ : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి గుండెపోటుకు గురయ్యారు. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ గుండెపోటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమెను హుటాహుటిన నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇక జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న యువతిపై ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మపై నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్ అల్లుడు షమీర్ ఫిర్యాదు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది.
జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ తనను లైంగికంగా వేధించిందంటూ జానీ మాస్టర్ అల్లుడు షమీర్ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్‌తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్‌నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. కాగా దీనిపై ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Alia Bhatt | అలియా కుమార్తెకు ఊహించని గిఫ్ట్ పంపిన రామ్ చరణ్.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నటి