Balakrishna | హైదరాబాద్ : ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న అన్స్టాపబుల్ షో.. మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అన్స్టాపబుల్ సీజన్-4 స్ట్రీమింగ్కు సిద్ధమైంది. దసరా పండుగను పురస్కరించుకుని, సీజన్-4కు సంబంధించిన ట్రైలర్ను ఆహా వేదికగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. దసరా అంటేనే అమ్మవారు. శక్తి రూపం. గెలుపు అన్నది మన చేతుల్లోనే ఉంది. ఏదైతే కొత్తగా అనుకుంటామో ఆ జయం మనల్ని వరిస్తుంది. అందుకు ప్రతీక ఈ దసరా శరన్నవరాత్రులు. అన్స్టాపబుల్ మొదలవ్వడమే ఒక విస్ఫోటనం. నాన్న స్ఫూర్తితోనే అన్స్టాపబుల్ లాంటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారాను. వివిధ షోలకు వ్యాఖ్యాతగా చేయాలని ఆఫర్లు వచ్చాయి. కానీ కేవలం అల్లు అరవింద్ గారి కోసమే ఒప్పుకున్నా. వేరే వారు ఎవరైనా అడిగి ఉంటే ఈ షో చేసేవాడిని కాదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఎంతో మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు గత సీజన్లలో వచ్చారు. వారిని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగినా, అన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చారు. వాళ్ల వల్ల కూడా ఈ షో విజయవంతమైంది. అన్స్టాపబుల్ మూడు సీజన్లు విజయవంతం అయ్యాయి. అందుకే సీజన్-4 కొత్తగా అందించాలన్న ఉద్దేశంతో యానిమేషన్ రూపంలో ట్రైలర్ తీసుకొచ్చారు. గత సీజన్ల కంటే సీజన్-4 ఇంకా బాగుంటుంది. అది మీరే చూస్తారని బాలకృష్ణ తెలిపారు.
అన్స్టాపబుల్ టాక్ షో బాలయ్య భుజాలపై పెడితే.. ఆయన దాన్ని ఇంకా ఎత్తున పెట్టారని నిర్మాత అల్లు అరవింద్ ప్రశంసించారు. ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లకు పూర్తి భిన్నంగా సీజన్-4 ఉంటుందని, మరింత వినోదాన్ని పంచుతుందని అన్నారు. అక్టోబర్ 24 నుంచి సీజన్ -4 ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఇవి కూడా చదవండి..
Alia Bhatt | అలియా కుమార్తెకు ఊహించని గిఫ్ట్ పంపిన రామ్ చరణ్.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నటి
Tollywood Movies | దసరా స్పెషల్.. టాలీవుడ్ కొత్త సినిమా పోస్టర్లు చూశారా!
Jani Master | జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్.. బాధితురాలిపై కేసు పెట్టిన యువకుడు