Jani Master | టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ఊహించని ట్విస్ట్ వచ్చి చేరింది. జానీ మాస్టర్ కేసులో బాధితురాలిగా ఉన్న యువతిపై ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడో యువకుడు. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన శ్రష్టి వర్మపై నెల్లూరు పోలీసులకు జానీ మాస్టర్ అల్లుడు షమీర్ ఫిర్యాదు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది..
జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ తనను లైంగికంగా వేధించిందంటూ జానీ మాస్టర్ అల్లుడు షమీర్ నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మామ జానీ మాస్టర్‌తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ఆమె లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జిలో తనపై లైంగిక దాడి చేసి, నగ్న ఫొటోలు తీసి బెదిరించిందన్నాడు. అప్పుడు తాను మైనర్‌నని చెప్పాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. కాగా దీనిపై ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన యువతిపై ఫిర్యాదు చేసిన యువకుడి
జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు పెట్టిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించిందంటూ ఓ యువకుడు నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తన మామ జానీ మాస్టర్‌తో కలిసి హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్‌లకు… pic.twitter.com/ixDKEqox8W
— Telugu Scribe (@TeluguScribe) October 12, 2024