8 Vasantalu | టాలీవుడ్ యువ దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’(8 Vasantalu). దాదాపు 6 సంవత్సరాల తర్వాత మెగాఫోన్ పట్టిన ఈ దర్శకుడు ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక ‘8 వసంతాలు’(8 Vasantalu). సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో మ్యాడ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనిల్ కుమార్ శుద్ధి అయోధ్య అనే పాత్రలో నటించబోతుంది. దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ఓ అమ్మాయి తనకు ఉన్న బాధలు, ఆ బాధల్లోని బయటకు వచ్చి మార్షల్ ఆర్ట్స్ లో ఎలా ఎదిగింది, అమ్మాయిలు వంటింటికి పరిమితం కాదు అని చెప్పే కాన్సెప్ట్‌తో సినిమా రానున్నట్లు తెలుస్తుంది. ఇక వీడియో చివరిలో వచ్చిన అందాన్ని దాటి చూడగలిగితే ఆడదానితో ఒక సముద్రమే కనిపిస్తుంది. అంటూ వచ్చిన డైలాగ్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాపై దర్శకుడు మాట్లాడుతూ.. 365 రోజులని అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం… అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం. 8 వసంతాలు అంటే ‘8 స్ప్రింగ్స్’ ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం, ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ ఫ్లోర్ చేయనుంది.