(AP BJP) విజయవాడ: దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి జయంతిని పురస్కరించుకుని ఏపీలో బీజేపీ ఆధ్వర్యంలో సుపరిపాలనా దినోత్సవం జరిగింది. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు వాజపేయి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వాజపేయి చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ సహా ఇంఛార్జీ సునీల్ దేవ్‌ధర్ తదితరులు నివాళులర్పించారు.
వాజపేయి పరిపాలనా విధానం ఇవాల్టి పాలకులకు ఆదర్శనీయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇంఛార్జీ సునీల్ దేవ్‌ధర్ చెప్పారు. మోదీ పాలనలో ఎన్నో విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఏపీలో పాలన గురించి మాట్లాడిన దేవధర్.. ఇక్కడ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే కొనసాగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. పాలకులే బలవంతపు మతమార్పిడిలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే మొట్టమొదటగా మత మార్పిడులకు వ్యతిరేకంగా బిల్లు తెస్తామని చెప్పారు. మాయమాటలు చెప్తూ వైసీపీ నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..