Chandrababu | తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీకి పయనమయ్యారు. బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి వేర్వేరుగా హస్తినకు బయల్దేరి వెళ్లారు. పవన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో వీరిద్దరూ పాల్గొననున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. మరోవైపు ఈనెల 9న జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా ఢిల్లీ పెద్దలను చంద్రబాబు ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Bomb Threat | ఢిల్లీ – టొరంటో విమానానికి బాంబు బెదిరింపులు
Naveen Patnaik | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. సీఎం పదవికి నవీన్ పట్నాయక్ రాజీనామా
Supriya Sule | బారామతి స్థానం సుప్రియా సూలేదే.. ఉత్కంఠ పోరులో వదినపై ఘన విజయం