Supriya Sule | బారామతి స్థానం సుప్రియా సూలేదే.. ఉత్కంఠ పోరులో వదినపై ఘన విజయం
Supriya Sule | మహారాష్ట్రలోని శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి (Baramati) లోక్‌సభ నియోజకవర్గంలో సుప్రియా సూలే (Supriya Sule)నే గెలుపొందారు.
Supriya Sule | సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 292 సీట్లు రాగా, ప్రతిపక్ష ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఇక ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలోని శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి (Baramati) లోక్‌సభ నియోజకవర్గం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక్కడ వదినా మరదళ్లు ఒకరిపై ఒకరు పోటీకి దిగడమే ఇందుకు కారణం.
అయితే, ఈ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) కూటమి తరఫున నేషనలిస్ట్ కాంగ్రెస్ (శరద్ పవార్) పార్టీ అభ్యర్థిగా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే (Supriya Sule)నే గెలుపొందారు. తన వదిన, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య సునేత్ర పవార్‌ను చిత్తుగా ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించిన సుప్రియా నాలుగోసారి కూడా జయకేతనం ఎగురవేశారు. తన వదినపై ఏకంగా 1.55 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో సుప్రియా సూలేకి 7,32,312 ఓట్లు పోలవగా.. సునేత్రకు 5,73,979 ఓట్లు వచ్చాయి.
శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ (Ajit Pawar) ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరారు. దీంతో పవార్ కుటుంబంలో చీలికలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అజిత్ పవార్ తన భార్య సునేత్ర పవార్‌ను బారామతి నుంచి బరిలోకి దింపారు. ఈ క్రమంలో వదిన మరదలి మధ్య పోరుపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో చర్చ నడిచింది. ఇక ఈ ఎన్నికల్లో సుప్రియా సూలేనే గెలుపొంది తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగారు.
కాగా, బారామతి లోక్‌సభ స్థానంలో ఐదు దశాబ్దాలుగా పవార్ కుటుంబం జెండా ఎగురవేస్తోంది. ఇక్కడ 1967, 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ బారామతి నుంచే గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి 1984, 1996,1998, 1999, 2004లలో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక గత మూడు దఫాలుగా సుప్రియా సూలే బారామతి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 నుంచి సుప్రియా సూలే వరుగా ఈ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు.
Also Read..
Union Ministers: 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన కేంద్ర మంత్రులు వీళ్లే..
US congratulations | భారత ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంస.. దేశ ప్రజలకు అభినందనలు
Youngest MPs: భారత యువ ఎంపీలు వీళ్లే.. 25 ఏళ్లకే పార్లమెంట్‌కు ఎంట్రీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

