Youngest MPs: భారత యువ ఎంపీలు వీళ్లే.. 25 ఏళ్లకే పార్లమెంట్‌కు ఎంట్రీ
Youngest MPs: 25 ఏళ్లకే ఎంపీలుగా ఎన్నికయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ ఎన్నిక కాగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్‌లు లోక్‌జనశక్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు.
న్యూఢిల్లీ: తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు యువ ఎంపీలు( Youngest MPs)గా ఎన్నికయ్యారు. ఆ నలుగురు ఎంపీల వయసు 25 ఏళ్లు మాత్రమే ఉంది. పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్.. సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై గెలుపొందగా, శాంభవి చౌదరీ, సంజన జాతవ్.. లోక్‌జనశక్తి, కాంగ్రెస్ పార్టీ టికెట్లపై విజయం నమోదు చేశారు.
శాంభవి చౌదరీ.. బీహార్ నుంచి విక్టరీ సాధించారు.నితీశ్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న అశోక్ చౌదరీ కుమార్తె ఆమె. సమస్తిపుర్ నియోజకవర్గం నుంచి శాంభవి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సన్నీ హజారీపై ఆమె విక్టరీ కొట్టారు. సన్నీ హజారి కూడా ఓ మంత్రి కుమారుడు. ఎన్డీఏ ప్రచారం సమయంలో.. శాంభవి యువ అభ్యర్థి అని ప్రధాని మోదీ కొనియాడారు.
రాజస్థాన్‌లోని భరత్‌పుర్ నియోజకవర్గం నుంచి సంజనా జాతవ్ విజయం సాధించారు. ఆమె వయసు 25 ఏళ్లు. బీజేపీ అభ్యర్థి రామ్‌స్వరూప్ కోహ్లీపై 51,983 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ ఖేడీ చేతిలో 409 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. కప్తాన్ సింగ్ అనే పోలీసు కానిస్టేబుల్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.
పుష్పేంద్ర సరోజ్ అనే వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేశారు. కౌషాంబి పార్లమెంటరీ సీటుకు ఆయన పోటీపడ్డారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ పై లక్ష మెజారిటీతో పుష్పేంద్ర విజయం సాధించారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యూపీ మాజీ మంత్రి ఇంద్రజిత్ సరోజ్ కుమారుడే పుష్పేంద్ర.
మచ్చిలిషార్ నియోజకవర్గం నుంచి ప్రియా సరోజ్ సుమారు 35వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.బీజేపీ ఎంపీ బోలానాథ్‌పై ఆమె గెలుపొందారు.మూడు సార్లు ఎంపీగా గెలిచిన తూఫానీ సరోజ్ కుమార్తే ప్రియా సరోజ్.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
Digital Dashboard | కేంద్రీయ విద్యాలయ డిజిటల్ డ్యాష్‌బోర్డ్‌ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
Wildlife Protect | వన్యప్రాణులను కాపాడుకోవడం అందరి బాధ్యత
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

